RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..

ముందుగా ఎన్టీఆర్ - చరణ్ ల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. కథను బట్టి ఇద్దరి......

RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..

Rrr Review

RRR :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడటంతో టాక్ బయటకి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా రాజమౌళి దర్శకత్వానికి, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనని పొగుడుతున్నారు. సినిమా అద్భుతం, అదిరిపోయింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అభిమానులు, సెలబ్రిటీలు ఇస్తున్న బెనిఫిట్ షో రివ్యూ ఇదే..

 

ముందుగా ఎన్టీఆర్ – చరణ్ ల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా, ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఇద్దరు చెరో దారిలో తమ ప్రయాణం సాగించినా రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు. ఇక ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇద్దరూ సింహాల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా, రెండు పాత్రల మధ్య ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఆడియెన్స్ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం. ఆ విషయంలో ఇద్దరినీ మెచ్చుకోవాలి.

RRR : రామ్‌చరణ్ ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ ఎత్తున తరలి రానున్న అభిమానులు

ఇక అలియా భట్ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయా అలాగే మిగిలిన స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. అయితే, ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ – చరణ్ ల ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. చరణ్ – అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా వండర్ గా అనిపిస్తోంది. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.

RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

మొత్తమ్మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్. ఒక ఎమోషనల్ క్లాసిక్, ఒక యాక్షన్ ఫీస్ట్ అని అంటున్నారు సినిమా చూసిన వారంతా. రాజమౌళి టేకింగ్ మాత్రం అద్భుతం. ఆయన దర్శకత్వంలో బాహుబలితో ఓ రేంజ్ కి వెళ్తే ‘ఆర్ఆర్ఆర్’ ఆకాశాన్ని అంటింది. సినిమా చూసిన వారంతా రాజమౌళి టేకింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.