RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

మరోవైపు రామ్ చరణ్, రాజమౌళిలు భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఈ బెనిఫిట్ షో తెల్లవారు జామున మూడు గంటలకి మొదలైంది. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు......

RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

Rajamouli

 

RRR : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ మానియానే కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీ లాంటి స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ ట్రిపుల్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా బెనిఫిట్ షోలకు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లారు. చాలా మంది అభిమానులు బెనిఫిట్ షో టికెట్ల కోసం వేలల్లో ఖర్చుపెట్టి మరీ సినిమా చూస్తున్నారు.

 

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి AMB సినిమాస్ లో బెనిఫిట్ షో చూశారు. ఇక మరోవైపు రామ్ చరణ్, రాజమౌళిలు భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఈ బెనిఫిట్ షో తెల్లవారు జామున మూడు గంటలకి మొదలైంది. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మరికొంతమంది మెగా ఫ్యామిలీలు కలిసి ఈ బెనిఫిట్ షో చూశారు. రాజమౌళి, రామ్ చరణ్ లు థియేటర్ కి బెనిఫిట్ షోకి రావడంతో అభిమానులు ఈలలు, అరుపులతో హంగామా చేశారు. కొద్దీ సేపటి క్రితమే బెనిఫిట్ షో అయిపోగా రాజమౌళి, రామ్ చరణ్, మిగిలిన కుటుంబ సభ్యులు అభిమానుల కేరింతల మధ్య కష్టంగా థియేటర్ నుంచి బాడీగార్డులు సహాయంతో బయటకి వెళ్లారు.

RRR : మహేష్‌బాబు థియేటర్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన ఎన్టీఆర్

 

ఇక సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో, అలాగే దేశంలో కొన్ని చోట్ల బెనిఫిట్ షో పడటంతో అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తారక్, చెర్రీ నటన అదిరిపోయిందంటూ, రాజమౌళి టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు.