RRR : మహేష్‌బాబు థియేటర్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన ఎన్టీఆర్

సెలబ్రిటీలు సైతం బెనిఫిట్ షో చూడటానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇక తారక్ కూడా రాత్రి బెనిఫిట్ షో చూశారు. మహేష్ బాబు థియేటర్ AMB సినిమాస్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలు.....

RRR : మహేష్‌బాబు థియేటర్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన ఎన్టీఆర్

Ntr

 

RRR :  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ మానియానే కనిపిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దగ్గర నుంచి ఇద్దరు స్టార్ హీరోలతో కలిపి వస్తున్న మల్టీస్టారర్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ ట్రిపుల్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు టికెట్ల కోసం వేలల్లో ఖర్చుపెట్టి మరీ సినిమా చూస్తున్నారు.

సెలబ్రిటీలు సైతం బెనిఫిట్ షో చూడటానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇక తారక్ కూడా రాత్రి బెనిఫిట్ షో చూశారు. మహేష్ బాబు థియేటర్ AMB సినిమాస్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలు, నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారు. సినిమా చూసే ముందు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కి రెండు చేతులు పైకి ఎత్తి విక్టరీ సింబల్ చూపించారు. కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ సినిమా చూసి వెళ్లారు.

RRR: ఫాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే!

ఇక సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో, అలాగే దేశంలో కొన్ని చోట్ల బెనిఫిట్ షో పడటంతో అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తారక్, చెర్రీ నటన అదిరిపోయిందంటూ, రాజమౌళి టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు.