RRR: ఫాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే!

క్కడ చూసినా ట్రిపుల్ఆర్ మ్యానియానే కనిపిస్తోంది. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోయే ట్రిపుల్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ఆర్ గ్రాండ్..

RRR: ఫాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే!

RRR

RRR: ఎక్కడ చూసినా ట్రిపుల్ఆర్ మ్యానియానే కనిపిస్తోంది. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోయే ట్రిపుల్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ఆర్ గ్రాండ్ నెస్ అలాంటిది మరి. బడ్జెట్ దగ్గరనుంచి స్టార్ కాస్ట్, మేకింగ్, ప్రమోషన్స్ ఇలా సినిమాలో ఏ విషయం గురించి మాట్లాడినా.. ఫస్ట్ ఆ గ్రాండియరే కనిపిస్తోంది. ట్రిపుల్ఆఱ్.. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనడానికి అసలు ఈ సినిమాలో ఏమున్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

RRR థీమ్.. స్వరూపాలు, స్వభావాలు వేరైనా ప్రయత్నం మాత్రం ఒకటే!

బాహుబలితో టాలీవుడ్ స్టామినాను నేషన్ వైడ్ గా పరిచయం చేసిన రాజమౌళి.. ఇప్పుడు ట్రిపుల్ఆర్ ని ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దేందుకు డిసైడ్ అయ్యారు. సినిమాలో ప్రతీదీ ఇంటర్నేషన్ స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యేలా గ్రాండ్ గా ట్రిపుల్ఆర్ ని తెరకెక్కించారు. 500కోట్ల బడ్జెట్.. అసలు ఇప్పటి వరకూ ఇండియన్ హిస్టరీలోనే ఇంత బడ్జెట్ తో ఏ సినిమా తెరకెక్కలేదు. అలాంటిది ఒక తెలుగు డైరెక్టర్ తన బిగ్ డ్రీమ్ ని వరల్డ్ వైడ్ కాన్వాస్ మీద ట్రిపుల్ఆఱ్ గా చూపించడబోతున్నారు. 350 కోట్లు ఓన్లీ మేకింగ్ కోసమే స్పెండ్ చేశారంటే.. ఏ రేంజ్ లో సినిమాని చూపించబోతున్నారో తెలుస్తోంది.

RRR: 4 ఏళ్ల క్రితం ఆలోచన.. కొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్ మీద ట్రిపుల్‌ఆర్!

స్టార్ కాస్ట్ తో మరో షాక్ ఇచ్చారు రాజమౌళి. చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలకు బాలీవుడ్ ఆలియా, అజయ్ దేవ్ గన్ లని యాడ్ చేసి సినిమాకు గ్రాండియర్ తీసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా హాలీవుడ్ నంచి ఒలీవియా మోరిసన్, ఆరిసన్ డూడీ లాంటి టాప్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ని రప్పించి సినిమాను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు.

RRR: కొన్ని గంటల్లోనే ఆర్ఆర్ఆర్.. ప్లస్, మైనస్ అంశాలివే!

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్టుగా జరిగింది. షూటింగ్ కాకుండా జస్ట్ రిహార్సల్స్ కే 200రోజులు తీసుకున్నారు. ఇక షూటింగ్ 300 రోజులకు పైగా చేశారు టీమ్. 240 రోజుల్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేయాలనుకున్నరాజమౌళి.. 60 రోజులు ఎక్కువే తీసుకున్నారు. 25 నుంచి 28 రోజులు జరగాల్సిన నైట్ షూట్ 60 నైట్స్ చేశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను 75రోజులు షూట్ చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 2500 మంది లోకల్ ఫైటర్స్ లండన్ నుంచి 40 మంది ఫైటర్స్ తో గ్రాండ్ గా షూట్ చేశారు. రామ్ చరణ్ పై రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసిన లాఠీఛార్జీ సన్నివేశం కోసం 200 మంది పనిచేశారు.

RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

ఆర్ఆర్ఆర్ లో నెవర్ బిఫోర్ లొకేషన్స్ చూపించబోతున్నారు. గండిపేట సమీపంలో 10 ఎకరాల్లో ఢిల్లీ సెట్ తో పాటు.. హైదరాబాద్ లోకల్ లొకేషన్స్, గుజరాత్ తో పాటు బల్గేరియా, నెదర్లాండ్, ఉక్రెయిన్, లాంటి బ్యూటిఫుల్ కంట్రీస్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేశారు. ఉక్రెయిన్ లోని రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్ లోనే నాటునాటు పాట షూట్ చేశారు. నాటు నాటు కేవలం మాస్ బీట్ సాంగే కాదు అందులో చాలా ఎమోషన్ జర్నీ కూడా ఉంటుంది.

RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!

రామోజీఫిల్మ్ సిటీలో రామ్ చరణ్ పాత్ర అల్లూరి సీతారామరాజు పరిచయ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇవన్నీ తీస్తే.. బల్గేరియాలో ఎన్టీఆర్ పాత్ర కొమురంభీమ్ పరిచయ సన్నివేశాలు, పులితో యాక్షన్ సీన్స్ చేశారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ లయన్ కింగ్ కి పనిచేసిన లండన్ ఫేమస్ ఎంపీసీ కంపెనీ పులి పోరాట సన్నివేశాన్ని సీజీ లో గ్రాండ్ గా అద్భుతంగా పిక్చరైజ్ చేసింది.

RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..

ఇంత గ్రాండ్ గా తెరకెక్కించిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. ఎక్కడ చూసినా ట్రిపుల్ఆర్ ప్రమోషన్లు, ఈవెంట్లు, ప్రెస్ మీట్లతో సందడి చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు సంబందించి నెవర్ బిఫోర్ ఇంటర్వ్యూలు ప్రమోషన్లతో ఇండియా వైడ్ గా తిరిగి ట్రిపుల్ ఆర్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు ట్రిపుల్ఆర్ టీమ్.

RRR: ఆస్ట్రేలియా బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రిలీజ్‌గా ట్రిపుల్‌ఆర్!

3 వేల మంది టెక్నీషియన్లు, 10 మంది కో డైరెక్టర్ల తో నెవర్ బిఫోర్ క్రూ తో తెరకెక్కించిన ఈ గ్రాండ్ మూవీ బిజినెస్ కూడా అదే రేంజ్ లో చేసింది. ఇప్పటికే 450 కోట్లకు ప్రీ రిలీజ్ చేసుకున్న ట్రిపుల్ ఆర్.. వరల్డ్ వైడ్ గా 11 వేల ధియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఒక్క అమెరికాలోనే 1150 లొకేషన్స్ లో 2500లకు పైగా ధియేటర్లలో రిలీజ్ అవుతోంది ఈ భారీ బడ్జెట్ మూవీ.

RRR: అమెరికాలో తారక్ క్రేజ్.. ‘జై ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్’ కార్ ర్యాలీ!

యూకేలో 1100 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్.. ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, ధాయ్ లాండ్ జపాన్ అన్నీ కలుపుకుని 2 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక నార్త్ లో 3 వేల ధియేటర్లలో రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజే 75 వేల నుంచి 80 వేల షోలతో రికార్డ్ క్రియేట్ చెయ్యబోతోంది ట్రిపుల్ ఆర్. పెరిగిన టికెట్ రేట్స్ తో ఒక్కో రోజుకి 40 కోట్ల కలెక్షన్లు ఎక్స్ ట్రా రాబోతున్నాయి. దాంతో ఫస్ట్ డేనే 150 నుంచి 170 కోట్ల కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతోంది ఆర్ఆర్ఆర్. ఇలా ఆర్ఆర్ఆర్ కి సంబందించి బడ్జెట్ నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ వరకూ ప్రతీదీ రికార్డ్ రేంజ్ లో ట్రిపుల్ఆర్ ని ఇండియన్ ప్రైడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాజమౌళి.