RRR: 4 ఏళ్ల క్రితం ఆలోచన.. కొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్ మీద ట్రిపుల్‌ఆర్!

సినిమా కమిట్ అయ్యి4 ఏళ్లు.. షూటింగ్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒక టాప్ డైరెక్టర్.. అంతా కలిస్తే.. ఓ ట్రిపుల్ ఆర్. సరిగ్గా 4 ఏళ్ల నుంచి టాలీవుడ్..

RRR: 4 ఏళ్ల క్రితం ఆలోచన.. కొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్ మీద ట్రిపుల్‌ఆర్!

Rrr (1)

Updated On : March 24, 2022 / 9:02 PM IST

RRR: సినిమా కమిట్ అయ్యి4 ఏళ్లు.. షూటింగ్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒక టాప్ డైరెక్టర్.. అంతా కలిస్తే.. ఓ ట్రిపుల్ ఆర్. సరిగ్గా 4 ఏళ్ల నుంచి టాలీవుడ్ జనాల్నేకాదు.. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమా అంత ఈజీగా ఆడియన్స్ ముందుకు రావడం లేదు. ట్రిపుల్ ఆర్ ఆలోచనని ఆడియన్స్ వరకూ రాజమౌళి ఎలా తీసుకొచ్చారో.. ఇద్దరు స్టార్ హీరోల్ని ఒకే స్క్రీన్ మీద ఎలా చూపించబోతున్నారో ఒకసారి గుర్తు చేసుకుందాం.

RRR: కొన్ని గంటల్లోనే ఆర్ఆర్ఆర్.. ప్లస్, మైనస్ అంశాలివే!

మూడేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ సినిమా స్టార్ట్ అయ్యింది. అంతకన్నా ఓ సంవత్సరం ముందే తారక్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి క్రేజీ గా ఓ ఫోటో పోస్ట్ చేసి.. ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేశారు. 4 ఏళ్లక్రితం మొదలైన ట్రిపుల్ ఆర్.. ఎప్పటి కప్పుడు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తూనే ఉంది. సినిమా మీద ఏమాత్రం ఇంట్రస్ట్ తగ్గకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు రాజమౌళి.

RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

4 ఏళ్ల క్రితం ఆలోచనకి… సంవత్సరం పాటు సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్, షెడ్యూల్స్, సెట్స్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని రకాలుగా హోమ్ వర్క్ చేసుకుని మూడేళ్ల నాడు సెట్లోకి అడుగుపెట్టింది ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో తన ఆర్ఆర్ఆర్ ఆలోచనని తెరమీదకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు రాజమౌళి.

RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!

అసలు చరణ్, తారక్ లాంటి ఇద్దరు స్టార్ హీరోల్నే ఓ స్క్రీన్ మీద చూడడం పెద్ద విషయమైతే.. ఇలాంటి సర్ ప్రైజ్ లు సినిమా స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఇస్తూనే ఉన్నారు రాజమౌళి. ఇప్పటి వరకూ తెలుగు వైపు చూడని బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్ గన్ ని ట్రిపుల్ఆర్ లో ఇంపార్టెంట్ రోల్ లో పరిచయం చేశారు.

RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..

టాలీవుడ్ నుంచి హీరోయిన్లు బాలీవుడ్ వెళ్లి అక్కడ ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాని తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు రాజమౌళి. రాజమౌళి సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేస్తానని వెంటపడి మరీ ఛాన్స్ దక్కించుకున్న ఆలియాని రామ్ చరణ్ కు జంటగా సెట్ చేశారు జక్కన్న.

RRR: ఆస్ట్రేలియా బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రిలీజ్‌గా ట్రిపుల్‌ఆర్!

సినిమా స్టార్ట్ చేసిన దగ్గరనుంచి రకరకాలకారణాలతో సినిమా ఆగిపోయినా.. షూటింగ్ పోస్ట్ పోన్ అయినా.. ఆ టైమ్ ని కూడా క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కే వాడుకున్నారు రాజమౌళి. అందుకే సినిమాని అన్ కాంప్రమైజ్డ్ గా తీసి ఆడియన్స్
చేత గట్స్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు.