RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

మెగా టార్గెట్ తో జక్కన్న ట్రిపుల్ ఆర్ ని పట్టుకొస్తున్నారు. 2 వేల కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు లాభాల పంట పండాలంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా..

RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

RRR

RRR: మెగా టార్గెట్ తో జక్కన్న ట్రిపుల్ ఆర్ ని పట్టుకొస్తున్నారు. 2 వేల కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు లాభాల పంట పండాలంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించాల్సిందే. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో పర్వాలేదు కానీ నార్త్ లో టార్గెట్ వర్కవుట్ అవుతుందా.. రాజమౌళి ముందున్న సవాళ్లను ట్రిపుల్ ఆర్ రికార్డులతో కొట్టేస్తుందా అనేది ఆసక్తిగా కనిపిస్తుంది.

RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!

నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ ఈ శుక్రవారం నుంచి జనాల్ని థియేటర్స్ కి రప్పించడం తప్ప మరే పని పెట్టుకోలేదు ట్రిపుల్ ఆర్ టీమ్. గ్యాప్ దొరికితే ఇంటర్వ్యూస్.. ప్లాన్ ప్రకారం ఈవెంట్స్.. ఈ రేంజ్ లో వాళ్ల కెరీర్ లోనే చరణ్, తారక్ ప్రమోషన్స్ చేసుండరు. అంతలా రెస్ట్ లేకుండా ట్రిపుల్ ఆర్ ను ప్రమోట్ చేయిస్తున్నారు రాజమౌళి. నిజమే.. జక్కన్న ముందున్న సవాళ్లు అలాంటివి. మెగా టార్గెట్ తో వస్తోన్న సినిమా అంటే మాటలా.. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టాలంటే ఈ తిప్పలు తప్పవు.

RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..

ఆడియెన్స్ సైడ్ ట్రాక్ అవకుండా ట్రిపుల్ ఆర్ పై కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు టీమ్. దుబాయ్ లో ల్యాండ్ అయి అక్కడివారిని ఫుల్ గా ఎంగేజ్ చేసిన టీమ్.. చిక్కబల్లాపూర్ లో సందడి చేశారు. సినీ హిస్టరీలోనే కొత్త రికార్డ్ కొట్టాలని చూస్తోన్న జక్కన్న.. బెంగళూర్, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్ కతా, వారణాసి సిటీస్ ను సైతం కవర్ చేశాడు. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో క్రేజ్ ఉంది.. అడ్వాన్స్ బుకింగ్ బాగుంది.. సో నార్త్ ఆడియెన్స్ కు చేరువయ్యేలా ఇలా నార్త్ ట్రిప్ ను అమలు చేశారు.

RRR : కన్నడ నాట ‘ఆర్ఆర్ఆర్’కి దెబ్బ మీద దెబ్బ

ఏపీ, తెలంగాణ కలిపి 191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ట్రిపుల్ ఆర్.. కర్ణాటకలో 41కోట్లు.. తమిళనాడులో 35కోట్లు, కేరళలో 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నార్త్ మొత్తం కలుపుకొని హిందీ వర్షన్ 92 కోట్ల బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 8కోట్ల హై బిజినెస్ తో ట్రిపుల్ ఆర్ థియేటర్స్ కొస్తుంది. అంటే వరల్డ్ వైడ్ టోటల్ 451 కోట్ల డీల్ తో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ కనీసం బ్రేక్ ఈవెన్ సాధించాలన్నా 453 కోట్లు రాబట్టాలి. అందుకే ఇంతలా జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్తున్నారు.

RRR: బ్రేక్ కోసం అంతసేపు వెయిట్ చేయాల్సిందే!

భారీ రేట్లకు ట్రిపుల్ ఆర్ ను ఆఫర్ చేసిన రాజమౌళి.. బయ్యర్యకు లాభాలు తెచ్చిపెట్టేందుకే ప్రమోషన్స్ తో కష్టపడుతున్నారు. భారీ ప్రాఫిట్స్ రావాలంటే బాహుబలి 2ను మించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టాలి ట్రిపుల్ ఆర్. మామూలుగానే ఏపీ, తెలంగాణ నుంచి హైయ్యెస్ట్ కలెక్షన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. నార్త్ బెల్ట్ పైనే మేకర్స్ కి కాస్త టెన్షన్ ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా అక్కడ పోటీ ఇవ్వబోతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఇంకా అడ్వాన్స్ బుకింగ్ నడుస్తూనే ఉంది. టాక్ గనుక అంచనాలు మించేస్తే.. 2వేల కోట్లే జక్కన్న అసలైన టార్గెట్. దాన్ని రీచ్ అవుతే మాత్రం ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలువడం ఖాయం.