RRR : కన్నడ నాట ‘ఆర్ఆర్ఆర్’కి దెబ్బ మీద దెబ్బ

ఇప్పటికే కర్ణాటకలో 'బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్' అంటూ ట్రెండ్ నడుస్తుంది. కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో సినిమా కన్నడలో రిలీజ్ అవ్వట్లేదు. కొన్ని టెక్నికల్ కారణాలతో ప్రస్తుతం..................

RRR : కన్నడ నాట ‘ఆర్ఆర్ఆర్’కి దెబ్బ మీద దెబ్బ

Rrr

 

RRR :  దేశ వ్యాప్తంగా రేపు మార్చ్ 25న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలుండగా రాజమౌళి, చరణ్, తారక్ లు కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నా కర్ణాటకలో మాత్రం సవాళ్లు ఎదురవుతున్నాయి.

 

ఇప్పటికే కర్ణాటకలో ‘బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్’ అంటూ ట్రెండ్ నడుస్తుంది. కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో సినిమా కన్నడలో రిలీజ్ అవ్వట్లేదు. కొన్ని టెక్నికల్ కారణాలతో ప్రస్తుతం కర్ణాటకలో తెలుగు, హిందీ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో కన్నడ నాట వ్యతిరేకత ఎదురైంది. కన్నడ భాషాభిమానంతో మా భాషలో రిలీజ్ చేయట్లేదంటూ సినిమాని బాయ్ కాట్ చేయాలి అంటూ అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కచ్చితంగా కర్ణాటకలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వసూళ్లపై దెబ్బ పడనుంది.

James : పునీత్ కోసం కలిసిన రాజకీయ పార్టీలు.. చివరి సినిమాని థియేటర్లలోంచి తీయొద్దు అంటూ ర్యాలీలు..

తాజాగా కర్ణాటకలో ‘ఆర్ఆర్ఆర్’ కి మరో దెబ్బ పడనుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ఇటీవల మార్చ్ 17న విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వారం రోజుల వరకు కర్ణాటకలో వేరే సినిమా రిలీజ్ చేయకూడదని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు. నేటితో సినిమా రిలీజ్ అయి వారం అయిపోవడంతో రేపట్నుంచి చాలా థియేటర్లలో ఈ సినిమాని తీసేసి ‘ఆర్ఆర్ఆర్’ని ప్రదర్శించనున్నారు.

RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?

దీంతో పునీత్ అభిమానులు, కర్ణాటక రాజకీయ నాయకులు పునీత్ చివరి సినిమాని అప్పుడే థియేటర్లలోంచి తీసేయొద్దు, వేరే భాష సినిమాల కోసం జేమ్స్ సినిమాను పక్కన పెట్టొద్దు అంటూ ర్యాలీలు నిర్వహిస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పునీత్ మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నా మన ‘ఆర్ఆర్ఆర్’కి కర్ణాటకలో గట్టిగానే దెబ్బ పడేలా ఉంది. మొత్తానికి కర్ణాటకలో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కొంచెం వ్యతిరేకత ఉండటమే కాకుండా, అనుకున్న థియేటర్ల కంటే తక్కువ థియేటర్లలోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో కర్ణాటకలో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లు తగ్గనున్నాయి అని భావిస్తున్నారు సినీ వర్గాలు.