RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?

మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో ఆర్ఆర్ఆర్...

RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?

Demand To Boycott Rrr In Karnataka Increases

RRR: మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాలతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా ఈ సినిమా రిలీజ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉండగా, ఇప్పుడు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ రాష్ట్రంలో ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

RRR: ఆస్ట్రేలియా బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రిలీజ్‌గా ట్రిపుల్‌ఆర్!

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను కన్నడలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను కర్ణాటకలో కేవలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కర్ణాటకలో RRR చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించగా, ఆ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా వచ్చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కర్ణాటకలో ఈ సినిమాను కేవలం తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడంపై అక్కడి జనం మండిపడుతున్నారు.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?

ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్‌ను కన్నడ భాషలోకి అనువదించకపోవడంతో తమ భాషను అవమానపరిచారంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై కన్నడిగులు గుర్రుగా ఉన్నారు. ఈ సినిమాను కన్నడ భాషలో రిలీజ్ చేస్తే తప్ప తాము చూడబోమంటూ అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాపై తమ వ్యతిరేకతను చూపుతున్నారు. ఇక బాయ్‌కాట్ ఆర్ఆర్ఆర్ ఇన్ కర్ణాటక(Boycott RRR In Karnataka) అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలంటూ సోసల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఆర్ఆర్ఆర్ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.