RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?

అనుకున్నది చేద్దాం.. ఎవరాపుతారో చూద్దామన్నట్టు రెచ్చిపోతున్నారు రాజమౌళి. కోడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు తెలుగులోనే కాదు.. అన్నీ భాషల్లోనూ ట్రిపుల్ ఆర్ సునామీ సృష్టించేలా..

RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?

RRR

RRR: అనుకున్నది చేద్దాం.. ఎవరాపుతారో చూద్దామన్నట్టు రెచ్చిపోతున్నారు రాజమౌళి. కోడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు తెలుగులోనే కాదు.. అన్నీ భాషల్లోనూ ట్రిపుల్ ఆర్ సునామీ సృష్టించేలా ప్లాన్స్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే నెవర్ బిఫోర్ రేంజ్ లో సౌత్, నార్త్ స్టేట్స్ లో ఈవెంట్స్ జరిపేస్తున్నారు. అయితే నిజంగానే ట్రిపుల్ ఆర్.. జక్కన్న అనుకున్న రేంజ్ లో మిగిలిన రాష్ట్రాల్లో సందడి చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

RRR: టీ కప్పులతో ఆర్ఆర్ఆర్ హీరోల చిత్రాలు!

పక్కాగా అనుకున్న వ్యూహాల్ని రాజమౌళి అమలు చేస్తున్నారు. రిలీజ్ లేట్ అయినా సరే.. కావాల్సినంత బజ్ ఫ్యాన్స్ లో క్రియేట్ చేసి మరీ థియేటర్స్ కి ట్రిపుల్ ఆర్ ని తీసుకొస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చరణ్, తారక్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. ఇక్కడ కమర్షియల్ గా గట్టెక్కడం సాధ్యమే. కానీ పక్క రాష్ట్రాల్లో కూడా హై ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మేకర్స్.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొడితేనే లెక్కలతో చుక్కలు చూపించగలుగుతారు.

RRR: అమెరికాలో తారక్ క్రేజ్.. ‘జై ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్’ కార్ ర్యాలీ!

కన్నడ మార్కెట్ పై కన్నేసిన జక్కన్న.. అక్కడి వారిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయినట్టే. ఏ హైదరాబాద్ లోనో.. వైజాగ్ లోనో కాకుండా ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ ఈవెంట్ ను కర్ణాటకలో నిర్వహించి తన ప్లాన్ ను సూపర్ గా వర్కవుట్ చేశారు. సినిమా లాంగ్ రన్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ అదిరిపోయేలా జక్కన్న మార్క్ స్ట్రాటజీని అమలు చేశారు. కన్నడ రైట్స్ ను భారీ పెట్టుబడితో దక్కించుకున్న నిర్మాతలు సేఫ్ అయ్యేలా మాత్రమే కాదు.. ఫ్యూచర్ లో రాజమౌళి, రామ్ చరణ్, రామారావ్ మార్కెట్ ఇంకాస్త పెరగాలన్నా.. ట్రిపుల్ ఆర్ గట్టి హిట్ కొట్టాల్సిందే.

RRR: ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ ఫైట్.. వెనక ఇంత పెద్ద కథ నడిచిందా?!

నార్త్ మార్కెట్ సైతం రాజమౌళి అండ్ టీమ్ కి కీలకమే. అందుకే ఎప్పుడూ, ఎవరూ తిరగని నగరాల్లో ట్రిపుల్ ఆర్ టీమ్ సందడి చేస్తోంది. నార్త్ అంటే ఒక్క ముంబై మాత్రమే కాదు కదా.. అందరికీ దగ్గరవాలంటే అన్ని చోట్లకు వెళ్లాల్సిందే. అందుకే బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్ కతా, వారణాసిలను తన ప్రమోషన్ స్పాట్స్ గా వాడుకుంటున్నారు. అక్కడివారిని కట్టిపడేసేందుకు రకరకాలుగా ప్రమోషన్ స్టంట్స్ చేస్తున్నారు.

RRR: ఏళ్లకు ఏళ్ళు షూటింగ్.. జక్కన్నను ఓ ఆట ఆడేసుకున్న సుమ-తారక్

ఇక జనవరిలో రిలీజ్ అనుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ తో నాటు స్పెప్పు వేయించిన టీమ్.. రీసెంట్ గా ఢిల్లీలో ఆమీర్ ఖాన్ తో డాన్స్ చేయించింది. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ తో కావాల్సినంత బజ్ నార్త్ ఆడియెన్స్ లో క్రియేట్ అవుతోంది. నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ట్రిపుల్ ఆర్ హిందీ.. 2కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఊపు ఇంకాస్త పెరిగితే.. బాలీవుడ్ థియేటర్స్ లో ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్స్ కొత్త రికార్డ్ ను నమోదు చేస్తోంది. అటు ఓవర్సీస్ లో విపరీతంగా జనం ఎదురుచూస్తున్నారు. అన్నీ ఇలాగే.. జక్కన్న అనుకున్నట్టే ముందుకెళ్తే.. బాహుబలి2ను మించిన కలెక్షన్స్.. అంతకుమించిన నేమ్, ఫేమ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా క్రియటవడం ఖాయం.