RRR: టీ కప్పులతో ఆర్ఆర్ఆర్ హీరోల చిత్రాలు!

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మేనియాతో యావత్ ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని వారు ఎంతో....

RRR: టీ కప్పులతో ఆర్ఆర్ఆర్ హీరోల చిత్రాలు!

Tea Cup Art On Rrr Movie Goes Viral

RRR: ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మేనియాతో యావత్ ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని వారందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ చేస్తూ ఆర్ఆర్ఆర్‌పై క్రేజ్‌ను అమాంతం పెంచేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో RRR బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tea Cup Art 01

RRR: అమెరికాలో తారక్ క్రేజ్.. ‘జై ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్’ కార్ ర్యాలీ!

కాగా ఈ సినిమాలోని తమ అభిమాన హీరోలు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారా అని అటు తారక్ ఫ్యాన్స్‌‍తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో తెలియజేస్తూ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో తారక్, చరణ్ ఫ్యాన్స్ పోటీ పడి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వీరి అభిమానానికి ఆకాశామే హద్దుగా మారింది. ఇక తాజాగా టీ కప్పులతో ఆర్ఆర్ఆర్ హీరోల చిత్రాలు చేసి ఓ అభిమాని ఈ సినిమాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Tea Cup Art 02

RRR: గయ్యాళి అత్త సుమ.. నోరు లేని భర్త రాజీవ్.. తారక్ ఫన్నీ కామెంట్స్!

పురుషోత్తం అనే వ్యక్తి టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల చిత్రాలను చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. RRR సినిమా రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తు తమ సత్తా చాటుతున్నారు అభిమానులు. ఈ క్రేజ్ చూస్తుంటే, ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ మేనియా తగ్గకపోవచ్చని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Tea Cup Art 03