RRR: బ్రేక్ కోసం అంతసేపు వెయిట్ చేయాల్సిందే!

ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి...

RRR: బ్రేక్ కోసం అంతసేపు వెయిట్ చేయాల్సిందే!

Rrr First Half Is Lengthy Than Second Half

RRR: ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి మరోసారి ఇండియన్ సినిమా పవర్ ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పడం ఖాయమని ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో తారక్, చరణ్‌లు ఇద్దరు కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అప్పుడే లెక్కలు వేస్తున్నారు సినిమా ఎక్స్‌పర్ట్స్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే లాక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌ల రన్‌టైమ్ గురించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త తెగ్ వైరల్‌గా మారింది.

RRR: జర్నీ ఆఫ్ ఆర్ఆర్ఆర్!

ఆర్ఆర్ఆర్ చిత్రం టోటల్ రన్ టైమ్ ఏకంగా 3 గంటల 02 నిమిషాలుగా చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. దీనిలో ఫస్ట హాఫ్ ఏకంగా 1 గంట 40 నిమిషాల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే ఇంటర్వెల్ బ్రేక్ వస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ కూడా 1 గంట 22 నిమిషాల పాటు ఉంటుందని, ఇది సినిమాకే కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఇంత లెంగ్తీ చిత్రం కావడంతోనే ఇంటర్వెల్ బ్రేక్‌కు ముందు ఓపెనింగ్‌కు అంత సమయం కేటాయించాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 20 నిమిషాలు కాగానే ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారని, వారికి అంత సమయం గడిచిపోయిందనే విషయం కూడా తెలియదని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?

ఏదేమైనా జక్కన్న ఫస్ట్ హాఫ్‌కే అంత నిడివి పెట్టాడంటే, ఖచ్చితంగా సినిమాలో ఏదో బలమైన కంటెంట్ ఉండే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి జక్కన్న చెక్కిన ఈ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లు ప్రేక్షకులను ఎంతమేర కట్టిపడేస్తాయో, ఈ రెండింటిలో ప్రేక్షకులను ఏది అమితంగా ఆకట్టుకుంటుందో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్, అందాల భామలు ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.