RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..

వచ్చే కలెక్షన్లని లెక్కబెట్టుకునే ముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులని సృష్టించింది. దాదాపు 450 కోట్లకు పైగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్............

RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..

Rrr (1)

 

RRR :  దేశ వ్యాప్తంగా రేపు మార్చ్ 25న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలుండగా రాజమౌళి, చరణ్, తారక్ లు కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచారు. సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే అనేక రికార్డులని సృష్టిస్తుంది. తాజాగా మరో కొత్త రికార్డుని సృష్టించింది ‘ఆర్ఆర్ఆర్’.

వచ్చే కలెక్షన్లని లెక్కబెట్టుకునే ముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులని సృష్టించింది. దాదాపు 450 కోట్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

నైజాం – 70 కోట్లు

సీడెడ్ – 37 కోట్లు

నెల్లూరు – 8 కోట్లు

గుంటూరు – 15 కోట్లు

కృష్ణా – 13 కోట్లు

వెస్ట్ గోదావరి – 12 కోట్లు

ఈస్ట్ గోదావరి- 14 కోట్లు

ఉత్తరాంధ్ర – 22 కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

కర్ణాటక – 41 కోట్లు

తమిళనాడు – 35 కోట్లు

కేరళ – 9 కోట్లు

నార్త్ – 100 కోట్లు

ఓవర్ సీస్ – 75 కోట్లు

RRR: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్!

మొత్తం ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా కనీసం 460 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు. రాజమౌళి 1000 కోట్ల కలెక్షన్స్ ని టార్గెట్ లో పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి మొదటి రోజు ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నికోట్లు సాధిస్తుందో? మొత్తంగా ఎన్ని కోట్లు సాధించి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.