RRR: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్!

దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి....

RRR: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్!

Rrr Team Participates In Green India Challenge

RRR: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర యూనిట్. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?

ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఇప్పటికే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారని, తాము కూడా మొక్కలు నాటేందుకు ఎక్కువ ఇష్టపడతామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. గతంలోనూ బాహుబలి టీమ్ సభ్యులతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నట్లు ఈ సందర్భంగా జక్కన్న పేర్కొన్నారు.

RRR: ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్.. నార్త్‌లో ఆసక్తిలేని ప్రీ రిలీజ్ బుకింగ్స్!

ప్రకృతి, పర్యావరణం ఎప్పటికీ తమ మనసుకు దగ్గరగా ఉంటాయని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తామెప్పుడూ ముందుంటామని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. అటు ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత ముందుకు వెళ్లాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ బిజీలో ఉండి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న చిత్ర యూనిట్‌కు ఎంపీ సంతోష్ అభినందనలు తెలియజేశారు. ఇక మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, ఈ సినిమా సూపర్ హిట్ కావాలని అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుతున్నారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.