RRR: ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్.. నార్త్‌లో ఆసక్తిలేని ప్రీ రిలీజ్ బుకింగ్స్!

ఎంత బజ్ క్రియేట్ చేస్తున్నా.. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ కానిస్తున్నా జక్కన్నను ట్రిపుల్ ఆర్ టెన్షన్ ఓ పక్క వెంటాడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ చూపిస్తున్నంత క్రేజ్..

RRR: ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్.. నార్త్‌లో ఆసక్తిలేని ప్రీ రిలీజ్ బుకింగ్స్!

RRR

RRR: ఎంత బజ్ క్రియేట్ చేస్తున్నా.. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ కానిస్తున్నా జక్కన్నను ట్రిపుల్ ఆర్ టెన్షన్ ఓ పక్క వెంటాడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ చూపిస్తున్నంత క్రేజ్ మిగిలిన రాష్ట్రాల్లో లేదన్నది వాస్తవం. రిలీజై టాక్ వచ్చాక పరిస్థితి మారుతుందేమో చెప్పలేం కానీ ఇప్పుడు 2022 హైయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ చూస్తే.. ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ పై కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

RRR: తారక్ వాడిన బుల్లెట్‌కు అంత ఖర్చా..?

హై ఎక్స్ పెక్టేషన్స్.. హై రేంజ్ బజ్.. ట్రిపుల్ ఆర్ మేనియా చూస్తుంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. నేషనల్ వైడ్ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో విపరీతంగా రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషన్స్ చేస్తున్నా కూడా ఇప్పటివరకైతే అక్కడి ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సల్మాన్, ఆమీర్, కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ ఉన్నా.. టాలీవుడ్ రీజనల్ సినిమాగానే ట్రిపుల్ ఆర్ ను అక్కడి ప్రేక్షకులు ట్రీట్ చేస్తున్నారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ వెలవెల బోవడం చూస్తుంటే రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?

ఒక్క నార్త్ లోనే కాదు.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సైతం ట్రిపుల్ ఆర్ ఊపు పెద్దగా కనిపించట్లేదు. బాహుబలి2 తర్వాత ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో పాగా వేయాలనుకున్న జక్కన్నకు బ్రేక్ వేసేలా కనిపిస్తున్నారు జనం. అయితే ఎక్కడ ప్రమోషన్స్ జరిగినా అక్కడికి జనం వస్తున్న మాట నిజం. కానీ వాళ్లే ఈ సినిమా కోసం థియేటర్ కి రావడానికి ఆలోచిస్తున్నారు. మన దగ్గర తగ్గేదే లే అన్నట్టే ఫస్ట్ మూడు రోజులు అడ్వాన్స్ బుకింగ్ దూసుకుపోయింది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో రిలీజై పాజిటివ్ టాక్.. మ్యాసివ్ హిట్ కొడితేనే థియేటర్ దాకా ఆడియెన్స్ వచ్చేలా కనిపిస్తున్నారు.

RRR: అమెరికాలో తారక్ క్రేజ్.. ‘జై ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్’ కార్ ర్యాలీ!

2022లో రిలీజైన ఇండియన్ సినిమాల్లో వరల్డ్ వైడ్ హైయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల లిస్ట్ లో ది కాశ్మీర్ ఫైల్స్, గంగుభాయ్ కతియావాడి, భీమ్లానాయక్, వలిమై, రాధేశ్యామ్ ఉన్నాయి. నార్త్ లో మాత్రమే గంగూభాయ్ సత్తా చాటితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే భీమ్లా దూసుకుపోయాడు. వలిమై హ్యూజ్ కలెక్షన్స్ సాధించందంటే అది ప్యూర్ గా తమిళ్ ప్రేక్షకులు కట్టబెట్టిందే. పునీత్ సెంటిమెంట్ తో కన్నడవారు జేమ్స్ ను ఆదరించారు. ఇక చిన్న సినిమాగా రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్.. నేషనల్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయింది కాబట్టి ఒక్క హిందీలో మాత్రమే రిలీజైనా.. అన్నిచోట్స ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాన్ ఇండియా బజ్ తో థియేటర్స్ కొచ్చిన రాధేశ్యామ్ లో ఆ కనెక్టివిటీ లేదు కాబట్టే.. నిర్మొహమాటంగా ముఖ్యంగా మిగిలిన రాష్ట్రాల జనం తిప్పికొట్టారు.

RRR: ఏళ్లకు ఏళ్ళు షూటింగ్.. జక్కన్నను ఓ ఆట ఆడేసుకున్న సుమ-తారక్

ట్రిపుల్ ఆర్ రిలీజయ్యే వరకు మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే. అసలే రీజనల్ ఫీలింగ్ నార్త్ లో కొంచెం పెరిగిందిప్పుడు. అందుకే కాస్త తేడా వచ్చినా ట్రోలింగ్స్ తో ఇక్కడి హీరోలకు నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు నెటిజన్స్. రాధేశ్యామ్ విషయంలో జరిగిందిదే. సో.. ట్రిపుల్ ఆర్ లో అన్ని లాంగ్వేజెస్ వారికి కనెక్టయ్యే సెల్లింగ్ పాయింట్ ఉంటేనే థియేటర్స్ కొచ్చే వారి నంబర్ పెరుగుతుంది. లేదంటే ఈ గ్యాప్ లో జక్కన్న ఇంకేదైనా మ్యాజిక్ చేస్తేనే ఫ్రైడే వరకు మిగిలిన రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకుంటుంది.