RRR: తారక్ వాడిన బుల్లెట్‌కు అంత ఖర్చా..?

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో.....

RRR: తారక్ వాడిన బుల్లెట్‌కు అంత ఖర్చా..?

Interesting Details About Motor Cycle Used In Rrr By Ntr

RRR: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తిగా ఉన్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‍‌లో నిర్వహిస్తూ చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్ర యూనిట్.. ఈ సినిమా రిజల్ట్‌పై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉంది.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?

కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది. ఈ క్రమంలోనే భీమ్ పాత్రలో నటించిన తారక్ ఈ సినిమాలో ఓ బులెట్ బండి నడుపుతూ మనకు కనిపిస్తాడు. ఇప్పుడు ఈ బులెట్ బండి కోసం చిత్ర యూనిట్ ఎంత ఖర్చు చేసిందో తెలుసుకుని ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. నిజానికి తారక్ వాడిన బులెట్ గురించి దర్శకుడు రాజమౌళి చాలా రిసెర్చ్ చేశాడట. తారక్ వినియోగించిన బులెట్ కంపెనీ పేరు వెలోసెట్ మోటార్ బైక్ అని తెలుస్తోంది. 1920 నుండి 1950 మధ్యలో ఈ కంపెనీ ప్రపంచ మోటార్ రేసింగ్ రంగంలో టాప్ ప్లేస్‌లో ఉండేదట. 350 సీసీ, 550 సీసీ ఇంజిన్ బండ్లను మాత్రమే ఈ కంపెనీ తయారు చేసేదట. అయితే ఈ కంపెనీ తయారు చేసిన ఎమ్ సిరీస్ మోడల్ బండినే ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ కోసం వాడారట.

RRR: ఆర్ఆర్ఆర్ థియేటర్స్.. కాలు పెట్టారో ఖతం!

1971లో ఈ కంపెనీ బైకుల ఉత్పత్తిని పూర్తిగా ఆపేసిందని.. దీంతో RRR కోసం జక్కన్న ఇప్పుడున్న మోటార్ బైకునే అప్పటి మోడల్ బండిలా తయారు చేయించారట. దీని కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ.10 లక్షల మేర ఖర్చు చేసినట్లు చెబుతోంది. పాత కాలం బండిలా మార్చిన ఈ బులెట్ బండికి ఇంత ఖర్చు పెట్టారంటే, అందులో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే తీరాలి అంటున్నారు అభిమానులు. మరి తారక్ నడిపిన ఈ బులెట్ బండి సినిమాలో ఎలాంటి ఛేజ్‌లు చేసిందో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వెండితెరపై చూసే వరకు ఆగాల్సిందే. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోండగా, డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.