RRR: ఆర్ఆర్ఆర్ థియేటర్స్.. కాలు పెట్టారో ఖతం!

అవును... ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల ఓనర్లు ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఇదే వార్నింగ్ ఇస్తున్నారు. ఎంత ప్రెస్టీజియస్ మూవీ అయినా, అదిరిపోయే స్టార్స్, అబ్బురపరిచే సీన్స్......

RRR: ఆర్ఆర్ఆర్ థియేటర్స్.. కాలు పెట్టారో ఖతం!

Rrr Theatre Owners Taking Precautions To Avoid Damage

RRR: అవును… ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల ఓనర్లు ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఇదే వార్నింగ్ ఇస్తున్నారు. ఎంత ప్రెస్టీజియస్ మూవీ అయినా, అదిరిపోయే స్టార్స్, అబ్బురపరిచే సీన్స్.. ఇలాంటివి ఏమున్నా కూడా సైలెంట్‌గా ఎవరి సీట్లలో వారు కూర్చుని సినిమాను చూసి బయటకు వెళ్లాలని వారు ఆర్డర్ వేస్తున్నారు. ఏమిటీ.. టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ సైలెంట్‌గా కూర్చోవడమా.. సమస్యే లేదు.. థియేటర్లలో నానా హంగామా చేయాల్సిందే.. స్క్రీన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి తమ అభిమాన హీరోల స్టెప్పులను అనుసరిస్తూ డ్యాన్సులు వేయాల్సిందే అని అభిమానులు అనుకుంటే మాత్రం వాళ్లకు ఖచ్చితంగా దిమ్మతిరిగే షాకిస్తున్నాయి కొన్ని థియేటర్లు.

RRR : థియేటర్ వద్ద బ్యానర్స్ విషయంలో గొడవ.. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్నం..

అసలే స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో థియేటర్లలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. అయితే కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి సీట్లను విరగ్గొట్టడం, స్క్రీన్ వద్దకు వెళ్లి నానా హంగామా చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి నష్టాలను తప్పించుకునేందుకు కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ఏకంగా స్క్రీన్ దగ్గరకు ఫ్యాన్స్ ఎవరూ రాకుండా మేకులు వేయిస్తున్నాయి. మరికొన్ని థియేటర్లలో స్క్రీన్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు.

RRR: టీ కప్పులతో ఆర్ఆర్ఆర్ హీరోల చిత్రాలు!

విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో స్క్రీన్ దగ్గర కనిపించిన మేకులు, ఫెన్సింగ్ చూసి స్థానికులు అవాక్కవుతున్నారు. ఫ్యాన్స్ ఎవరూ స్క్రీన్ దగ్గరకు రాకుండా ఉండేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు థియేటర్ యాజమాన్యం పేర్కొంది. ఏదేమైనా సదరు థియేటర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఆర్ఆర్ఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీని చూస్తూ ఊరికే ఎలా కూర్చుంటామని వారు అంటున్నారు. థియేటర్లలో ఈలలు, డ్యాన్సులు, పేపర్లు ఎగరేయడాలు లాంటివి లేకుండా తమ అభిమాన హీరోల సినిమాను చూడలేమని వారు పేర్కొన్నారు. ఇక ఈ థియేటర్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.