IPL 2026: వరుసగా రెండోసారి.. ఐపీఎల్ 2026 విజేత RCB
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది.
IPL 2026: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. ఆల్ రౌండ్ షోతో బెంగళూరు దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. 156 రన్స్ టార్గెట్ ను మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో జీటీని చిత్తు చేసింది. చేజ్ కింగ్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో 75 పరుగులతో చెలరేగాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీకి ఇది రెండో ఐపీఎల్ ట్రోఫీ. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ టైటిల్ ను కైవసం చేసుకుంది.
క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఫైనల్లోనూ మరోసారి ఆ జట్టును ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ ఫైనల్ కి చేరడం ఇది ఐదోసారి కాగా, రెండుసార్లు విజేతగా నిలిచింది. 17 ఏళ్ల పోరాటం తర్వాత గతేడాది (2025) నెగ్గిన ట్రోఫీని నిలబెట్టుకుంది ఆర్సీబీ.
Also Read: ఐపీఎల్ లో విజేతగా నిలిచే జట్టుకే కాదు రన్నరప్‌కు ప్రైజ్‌మనీ.. ఏ జట్టుకు ఎంత అంటే..
