IPL 2026 Prize Money : విజేతగా నిలిచే జట్టుకే కాదు రన్నరప్‌కు ప్రైజ్‌మనీ.. ఏ జట్టుకు ఎంత అంటే?
ఐపీఎల్ 2026 విజేతగా నిలిచే జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుంది ? రన్నరప్ జట్టుకు ఎంత నగదు అందుతుందో ఓ సారి చూద్దాం..
IPL 2026 Prize Money How Much get Winners and Runners full details here
- అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్
- కప్పు కోసం పోటీపడనున్న గుజరాత్, ఆర్సీబీ
- గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్‌మనీ
IPL 2026 Prize Money : ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు (ఆదివారం మే31) జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి విజేతగా నిలిచే జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుంది ? రన్నరప్ జట్టుకు ఎంత నగదు అందుతుందో ఓ సారి చూద్దాం..
ఐపీఎల్ 2026 సీజన్లో ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు 20 కోట్లు ప్రైజ్‌మనీగా లభించనుంది. ఇక రన్నరప్ జట్టుకు 12.5 కోట్లు దక్కనున్నాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 6.5 కోట్లు అందనున్నాయి.
Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభవ్ బ్యాటా మజాకానా.. 12 కోట్లు..
ఇక ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) గెలుచుకున్న ఆటగాడికి 10 లక్షలు, పర్పుల్ క్యాప్ విజేతకు 10 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు 10లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ఆటగాడికి 20లక్షలు అందజేస్తారు.
2008 నుంచి 2026 వరకు.. ఎంత మార్పు..
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ అనేక వేల రెట్లు పెరిగింది. మొదటి సీజన్లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లభించిన ప్రైజ్ మనీ 4.8 కోట్లు మాత్రమే. ఆ తర్వాత 2010లో దీనిని రూ. 10 కోట్లకు, 2014లో రూ. 15 కోట్లకు, 2018లో రూ. 20 కోట్లకు పెంచారు.
