Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభవ్ బ్యాటా మజాకానా.. 12 కోట్లు..
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ).
Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually
- వైభవ్ బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం పోటీపడుతున్న కంపెనీలు
- ఏడాదికి 12 కోట్లకు పైగా ఆఫర్
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించాడు వైభవ్ సూర్యవంశీ. 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుత 237.31 స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, ఐదు అర్థశతకాలు ఉన్నాయి. 15 ఏళ్ల వయసులోనే అరివీర భయంకర బౌలర్లను ఎదుర్కొంటూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ క్రేజ్ రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. భవిష్యత్తులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను అధిగమించి సూపర్ స్టార్‌గా అతడు ఎదిగే అవకాశం ఉందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అతడు ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం అతడు వాడుతున్న బ్యాట్‌కు ఎస్ఎస్(సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకోసం ఏడాదికి ఆ కంపెనీ అతడికి 50 లక్షల రూపాయలు చెల్లిస్తోంది. ఇక ఈ ఒప్పందం ఐపీఎల్‌తో ముగిసినట్లు తెలుస్తోంది.
Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually.
– It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026
ఐపీఎల్ విధ్వంసాల కారణంగా వైభవ్ క్రేజ్ అమాంతం పెరగడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని బడా కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి బ్యాట్ స్పాన్సర్ షిప్ కోసం ఏడాదికి 12 కోట్లకు పైగా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. వైభవ్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వైభవ్ పాత కంపెనీతోనే ఒప్పందం చేసుకుంటాడా? లేదా వేరే కంపెనీతో ఒప్పందం చేసుకుంటాడా? అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాట్ స్పాన్సర్‌గా ఎంఆర్ఎఫ్ వ్యవహరిస్తోంది. ఇందుకోసం కోహ్లీకి ఎంఆర్ఎఫ్ ఏడాదికి 12.5 కోట్లు చెల్లిస్తోంది.
