Harish Rao: కవిత పార్టీ గురించి అనవసరం.. నేనే టార్గెట్ ఎందుకు అయ్యాను.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడటానికి కూడా విముఖత తెలిపిన హరీష్ రావు(Harish Rao).
Harish Rao shocking comments on Kalvakuntla Kavitha Telangana Rashtra Sena party.
- కవిత టార్గెట్ చేయడంపై హరీష్ స్పందన.
- ఆమెనే ఆ ప్రశ్న అడగాలని వెల్లడి.
- కొత్త పార్టీపై చర్చ అనవసరమని స్పష్టీకరణ.
Harish Rao: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా 10టీవీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత తన్నీరు హరీష్ రావు పలు సంచలన విషయాలను పంచుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తనపై, కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై యాంకర్ అడిగిన సూటి ప్రశ్నలకు ఆయన అంతే విలక్షణంగా స్పందించారు.
Harish Rao: పార్టీలో ఆధిపత్య పోరు.. కేటీఆర్‌తో విభేదాలు.. ఎట్టకేలకు నోరువిప్పిన హరీష్ రావు
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నను సంధిస్తూ—’మీరు కవిత గారితో చాలా ఏళ్లుగా కలిసి పనిచేశారు, కానీ ఆమె మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేశారు? ఈ మధ్య కేటీఆర్‌ను కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా’ అని అడిగారు. దీనికి హరీష్ రావు(Harish Rao) ఎంతో వ్యూహాత్మకంగా సమాధానమిస్తూ, తనను టార్గెట్ చేసింది వారే కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం కూడా వారే చెప్పాలని, ఈ విషయాన్ని కవితనే అడగాలని స్పష్టం చేస్తూ టాపిక్‌ను దాటవేశారు.
ఆ తర్వాత యాంకర్ మరో అడుగు ముందుకు వేసి, కవిత స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)’ పార్టీ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ చర్చకు మరింత ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశంతో హరీష్ రావు ఆ విషయాన్ని సున్నితంగా తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆ చర్చ అసలు అనవసరమని, ఆ విషయం గురించి మాట్లాడటానికి తాను ఏమాత్రం సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. కవిత వ్యవహారంపై హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
