Harish Rao: పార్టీలో ఆధిపత్య పోరు.. కేటీఆర్‌తో విభేదాలు.. ఎట్టకేలకు నోరువిప్పిన హరీష్ రావు
మా మధ్య విధేదాలు రావాలని సీఎం రేవంత్ చాలా ఆశపడుతున్నాడని హరీష్ రావు (Harish Rao)అన్నారు.
Harish Rao finally clarifies the differences with KTR.
- కేటీఆర్, హరీష్ మధ్య పూర్తి సయోధ్య.
- ఇద్దరం కలిసికట్టుగానే పని చేస్తాం.
- ప్రత్యర్థుల ఆశలు ఎప్పటికీ నెరవేరవు.
Harish Rao: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ శాసనసభ ఉపనేత హరీష్ రావు మధ్య సయోధ్యపై రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ప్రత్యర్థి పార్టీలు సైతం తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా 10టీవీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హరీష్ రావు, తమ మధ్య ఉన్న బంధంపై, పార్టీలో తమ ఇద్దరి ప్రాధాన్యతపై వస్తున్న అనుమానాలకు అత్యంత ఆసక్తికర సమాధానాలతో చెక్ పెట్టారు.
Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ వివరాలు
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ నేరుగా ‘మీ ఇద్దరి మధ్య అసలు సయోధ్య ఉందా? క్యాడర్లో ఉన్న అనుమానాలకు మీరిచ్చే సమాధానం ఏంటి?’ అని ప్రశ్నించగా హరీష్ రావు(Harish Rao) అత్యంత స్పష్టతతో స్పందించారు. తెలంగాణ ప్రజలకు గానీ, తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గానీ ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. తామిద్దరం పూర్తి సమన్వయంతోనే పనిచేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఘంటాపథంగా ప్రకటించారు.
తమ మధ్య దూరం పెరుగుతుందని ఎవరైనా ఆశలు పెట్టుకుంటే, అది కేవలం దింపుడు కళ్లం ఆశే అవుతుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. తాము ఎవరికీ అలాంటి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తామిద్దరి మధ్య విభేదాలు రావాలని చాలా కోరుకుంటున్నాడని, కానీ ఆయన ఆశ ఎప్పటికీ నెరవేరదని చురకలు అంటించారు. ప్రస్తుతం హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
