Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ వివరాలు
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీ కారణంగా ట్రాఫిక్ పోలీసులు పలు మళ్లింపులు, పార్కింగ్ ఆంక్షలు విధించారు.
Police impose traffic restrictions in Hyderabad due to fish medicine distribution
- నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.
- వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్.
- పలు మార్గాల్లో వాహనాల మళ్లింపు.
Fish Prasadam: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8, 9 తేదీల్లో ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీకి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు పలు మళ్లింపులు, పార్కింగ్ ఆంక్షలు విధించారు. ఎంజే మార్కెట్ నుండి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అబిడ్స్, జీపీవో వైపునకు, అలాగే బేగం బజార్ నుండి వచ్చే వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపునకు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్ – తాజ్ ఐలాండ్ మధ్య భారీ వాహనాలకు అనుమతి లేదు, వీటిని ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుగా మళ్లిస్తారు.
MK Stalin: ఈ టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా ఉంటుందా? స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
నాంపల్లి వైపు నుండి వచ్చే కార్లను గృహ కల్ప, గగన్ విహార్, చంద్ర విహార్లలో పార్క్ చేసి గేట్ నంబర్ 2 ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి. ద్విచక్ర వాహనాల కోసం ఎంజే మార్కెట్ మార్గంలో మనోరంజన్ కాంప్లెక్స్, నాంపల్లి మార్గంలో షెజాన్ హోటల్ పక్కన గల భీమ్ రావు బడా వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆటోల కోసం షెజాన్ హోటల్ ముందు ప్రత్యేక స్టాండ్ ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లను సీడబ్ల్యూసీ గ్రౌండ్లో నిలపాలి. ఎంజే మార్కెట్ బస్సులకు గాంధీ భవన్, నాంపల్లి బస్సులకు గృహ కల్ప చివరి స్టాప్‌లు కాగా, ప్రయాణికులు అక్కడ దిగి గేట్ నంబర్ 2 ద్వారా లోపలికి వెళ్లాలి. వీఐపీ వాహనాలు ఎంజే మార్కెట్ నుండి వస్తే అదాబ్ హోటల్ లేన్ వద్ద ఎడమకు తిరిగి, నాంపల్లి నుండి వస్తే గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకుని కేటాయించిన వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలి.
