RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!

ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అందరి చూపులు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి.....

RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!

Rrr Shooting Journey

RRR: ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అందరి చూపులు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా బాహుబలి సిరీస్ తరువాత ఈ డైరెక్టర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై నెలకొన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా, ఈ చిత్రాన్ని పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా రాజమౌళి తెరకెక్కించాడు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన జర్నీ గురించి మనం ఇదివరకే కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RRR: జర్నీ ఆఫ్ ఆర్ఆర్ఆర్!

RRR సినిమాను తొలుత రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా సహా అనేక కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లకు చేరుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను 240 రోజుల్లో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించింది. దీని కోసం 200 రోజుల రిహార్సల్ కూడా చేశారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు 300 రోజులకు పైగా పట్టింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణకు ఏకంగా 75 రోజుల సమయం పట్టింది. 25 నుండి 28 రోజుల నైట్ షూటింగ్ చేయాలని తొలుత భావించినా, ఈ సినిమా 60 రోజుల నైట్ షూట్స్ జరుపుకుంది.

జక్కన్నతో పాటు ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా 9 మంది కో-డైరెక్టర్లు రాత్రింబవళ్లు శ్రమించారు. ఇక ఈ సినిమాకు పనిచేసిన టోటల్ టెక్నీషియన్ల సంఖ్య 3000. కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లలోనే లండన్‌కు చెందిన 2500 మంది పాల్గొనగా, అబ్రాడ్‌కు చెందిన 40 మంది ఫైటర్లు ఈ సినిమాలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, వికారాబాద్, గుజరాత్, బల్గేరియా, నెదర్లాండ్స్, ఉక్రెయిన్ ప్రాంతాల్లో జరుపుకున్నారు. గండిపేట సమీపంలో వేసిన ఢిల్లీ సెట్‌లో ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

రామోజీ ఫిలిం సిటీలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఇంట్రొడక్షన్, క్లైమాక్స్ సీన్స్‌ను షూట్ చేయగా.. బల్గేరియాలో కొమురం భీం ఎంట్రీ, పులితో ఫైట్ సీన్‌లను తెరకెక్కించారు. కాగా పులితో ఫైట్ సీన్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ను లండన్‌లోని మూవింగ్ పిక్చర్ కంపెనీ(ఎంపీసీ) పూర్తి చేసింది. ఇక ఉక్రెయిన్‌లోని రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో నాటు నాటు సాంగ్‌ను షూట్ చేశారు. కాగా ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో పాటు ఓ స్టంట్ కొరియోగ్రాఫర్ కూడా పనిచేశారు.

RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు

ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం జక్కన్నతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సుదీర్ఘంగా పనిచేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందించగా.. ఆయన భార్య శ్రీవల్లి ఏ రోజు ఏ సీన్ షూట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను, రిలీజ్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంది. అటు రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ సినిమాలోని యాక్టర్స్ రెమ్యునరేషన్, మార్కెటింగ్, ప్రమోషన్స్‌ను చూసుకున్నాడు.

మొత్తంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జర్నీ అందరూ అనుకుంటున్నట్లుగా అంత ఈజీగా ఏం జరగలేదని.. తనతో పాటు ఈ సినిమా పూర్తి కావడానికి చాలా మంది చాలా రోజులుగా కష్టపడుతూ వచ్చారని.. వారందరి సహాయం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో తనతో పాటు యావత్ చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఉన్నామని రాజమౌళి ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.