Naresh : బ్యానర్ స్థాపించి 50 ఏళ్ళు.. మళ్ళీ సినిమాలు నిర్మిస్తా..

గతంలో నరేష్ తల్లి విజయనిర్మల నిర్మాతగా విజయకృష్ణ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమాలు నిర్మించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్థ నుంచి సినిమాలు నిర్మించట్లేదు. ఈ సంస్థ........

Naresh :  బ్యానర్ స్థాపించి 50 ఏళ్ళు.. మళ్ళీ సినిమాలు నిర్మిస్తా..

Naresh

Naresh :  విజయ నిర్మల తనయుడు, సీనియర్ నటుడు నరేష్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా నిన్న మీడియాతో ముచ్చటించారు నరేష్. నరేష్ మాట్లాడుతూ.. ‘‘కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదు. 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో తెరంగేట్రం చేశాను. నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణానికి కారణమైన సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయ నిర్మలగార్లకు, నా గురువు జంధ్యాల గారికి థ్యాంక్స్‌. యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు ఇస్తున్న రచయితలు, దర్శక, నిర్మాతలకు, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని తెలిపారు.

Kajal Agarwal : ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టిన కాజల్

గతంలో నరేష్ తల్లి విజయనిర్మల నిర్మాతగా విజయకృష్ణ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమాలు నిర్మించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్థ నుంచి సినిమాలు నిర్మించట్లేదు. ఈ సంస్థ స్థాపించి 50 ఏళ్ళు అవుతుంది. దీంతో వాళ్ళ అమ్మ స్థాపించిన బ్యానర్ పై మళ్ళీ సినిమాలు తీస్తానని నరేష్ ప్రకటించారు. ఈ విషయంపై మాట్లాడుతూ.. ”విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌ స్థాపించి యాభై ఏళ్లు అవుతోంది. ఈ బ్యానర్‌ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలనుకుని ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని నరేశ్‌ తెలిపారు.