Nijam with Smitha : చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయిన హీరో నాని ఫాదర్.. పట్టించిన అగ్ర నిర్మాత కూతురు!

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ తెలుగులో 'నిజం విత్ స్మిత' అనే టాక్ షోని ప్రారభించారు. ఇటీవల మొదలైన ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ లుగా హాజరయ్యారు. తాజాగా ఈ షోకి నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుపాటి అతిధులుగా వచ్చారు. ఇక టాక్ షోలో నాని తన తండ్రి చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని అభిమానులతో పంచుకున్నాడు.

Nijam with Smitha : చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయిన హీరో నాని ఫాదర్.. పట్టించిన అగ్ర నిర్మాత కూతురు!

nani father

Nijam with Smitha : ఇటీవల కాలంలో టాలీవుడ్ లో టాక్ షోలు విపిరితమైన పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. తెలుగు ఓటిటి ఆహాతో ఈ టాక్ షోలకు క్రేజ్ వచ్చింది. బాలకృష్ణ, సమంత టాక్ షోలు ఆహాలో మంచి ప్రజాధారణ పొందాయి. తాజాగా మరో ఓటిటి కూడా టాక్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ తెలుగులో ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోని ప్రారభించారు. ఈ షోకి పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల మొదలైన ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ లుగా హాజరయ్యారు.

Nijam with Smitha : నిజం విత్ స్మిత.. చంద్రబాబుతో రెండో ఎపిసోడ్.. ప్రోమో రిలీజ్.. ఏపీలో మళ్ళీ పొలిటికల్ రచ్చ ఖాయం..

తాజాగా ఈ షోకి నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుపాటి అతిధులుగా వచ్చారు. ఇక టాక్ షోలో నాని తన తండ్రి చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని అభిమానులతో పంచుకున్నాడు. “మా నాన్న చిన్నతనంలో ఇంటిలో డబ్బులు తీసుకోని చెన్నై పారిపోయాడు సినిమాల్లో నటించడానికి. అలా చెన్నై వెళ్లిన మా నాన్న విజయ వాహిని స్టూడియోస్ గేట్ బయట రెండు రోజులు పాటు అక్కడే నిలబడి ఉన్నాడు. వాళ్ళు ఏమో లోపాలకి పంపించడం లేదు. మాయాబజార్ వంటి సినిమాలు నిర్మించిన నాగిరెడ్డి గారి కూతురు బయటకి వస్తూ గేట్ దగ్గర చిన్న పిల్లవాడిగా ఉన్న మా నాన్నని చూసి ఆగింది.

మా నాన్నని ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే మా నాన్న జవాబు చెప్పడం లేదు, ఎక్కడ వెనక్కి పంపిచేస్తారో అని. దీంతో ఆమె మా నాన్నని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళింది. దాదాపు వారం రోజులు వాళ్ళ ఇంటిలోనే అక్క అక్క అంటూ తిరిగాడు. ఇక మాటల్లో మాటగా ఒక రోజు మీ ఊరు ఎక్కడ అనగానే మా నాన్న నోరుజారి చెప్పేశాడు. ఇక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మా తాత వాళ్ళు వెళ్లి మా నాన్న ని రెండు పికి వెనక్కి తీసుకు వచ్చారు. మా నాన్న నుంచే సినిమా పై పిచ్చి ఉంది. అది నాకు రావడంతో, ఇవాళ నేను హీరో అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.