Nijam with Smitha : నిజం విత్ స్మిత.. చంద్రబాబుతో రెండో ఎపిసోడ్.. ప్రోమో రిలీజ్.. ఏపీలో మళ్ళీ పొలిటికల్ రచ్చ ఖాయం..
నిజం విత్ స్మిత టాక్ షో నుంచి ఇటీవల మొదటి ఎపిసోడ్ చిరంజీవితో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు త్వరలో రెండో ఎపిసోడ్ చంద్రబాబుతో సోని లివ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా నిజం విత్ స్మిత-చంద్రబాబు ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో...................

Nijam with Smitha show second episode with chandrababu promo released full episode streaming from february 17th in sony liv
Nijam with Smitha : ఇటీవల పలు ఓటీటీలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆహా ఓటీటీ బాలయ్య, సమంత టాక్ షోలతో బాగా క్రేజ్ తెచ్చుకోవడంతో ఇదే కోవలో వేరే ఓటీటీలు కూడా తెలుగులో టాక్ షోలు ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల సోనీ లివ్ ఓటీటీ తెలుగులో నిజం విత్ స్మిత అని పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా ఓ షోని ప్లాన్ చేశారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూట్ కూడా అయ్యాయి.
నిజం విత్ స్మిత టాక్ షో నుంచి ఇటీవల మొదటి ఎపిసోడ్ చిరంజీవితో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు త్వరలో రెండో ఎపిసోడ్ చంద్రబాబుతో సోని లివ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా నిజం విత్ స్మిత-చంద్రబాబు ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో.. చంద్రబాబు చిన్నప్పటి క్రష్ ల గురించి అడిగారు. ఇంకా రాయలసీమ వెనకపడి ఉండటానికి కారణం ఏంటి అని స్మిత అడగగా నాయకులే కారణం అని చంద్రబాబు అన్నారు. ఎప్పుడైనా మీరు గెలవరు అనిపించిందా అని అడిగారు స్మిత. అలాగే రాష్ట్రం విడిపోవడం గురించి, రాష్ట్ర బాగు గురించి చంద్రబాబు ఈ షోలో మాట్లాడినట్టు తెలుస్తుంది.
Ram Charan : బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ తో మెగా పవర్ స్టార్ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..
ఇటీవల కొన్ని నెలల క్రితం చంద్రబాబు అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో పాల్గొని అనేక రాజకీయ అంశాలు మాట్లాడటంతో ఆ ఎపిసోడ్ ఏపీలో పొలిటికల్ చర్చకి దారి తీసి విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఇప్పుడు ఈ షోలో కూడా చంద్రబాబు పొలిటికల్ అంశాలు మాట్లాడటంతో మరోసారి ఏపీలో ఈ ఎపిసోడ్ తో పొలిటికల్ రచ్చ ఖాయం అనిపిస్తుంది. నిజం విత్ స్మిత చంద్రబాబు ఎపిసోడ్ ఫిబ్రవరి 17 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.