Nayanthara: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..!

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా వస్తుందంటే, ఆమె అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తారో మనకు తెలిసిందే. కోలీవుడ్‌లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.....

Nayanthara: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..!

Nayanthara 75th Movie Announced Officiallly

Nayanthara: తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా వస్తుందంటే, ఆమె అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తారో మనకు తెలిసిందే. కోలీవుడ్‌లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా, నయనతార క్రేజ్ మరో లెవెల్‌లో ఉండటమే దీనికి కారణమని చెప్పాలి. హాట్ అందాల ఆరబోతతో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సబ్జెక్టులను కూడా చెడుగుడు ఆడుకోవడం ఈ అమ్మడికి వెన్నెతో పెట్టిన విద్య అని అంటారు కోలీవుడ్ క్రిటిక్స్. ఇక ఈ బ్యూటీ ఇటీవల తన ప్రేమికుడు విష్నేష్ శివన్‌ను వివాహమాడింది.

Nayanthara: అటు రజని.. ఇటు ధనుష్.. మధ్యలో నయన్!

అయితే ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా లేదా అని చాలా మందిలో ఓ ప్రశ్న మెదులుతూ వచ్చింది. కాగా, తాజాగా ఈ ప్రశ్నకు ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో చెక్ పెట్టేసింది నయన్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కెరీర్‌లోని ల్యాండ్ మార్క్ మూవీ అయిన 75వ చిత్రాన్ని కూడా ఈ బ్యూటీ అనౌన్స్ చేసింది.

Nayanthara: ప్రియుడితో తిరుమలలో నయన్.. పెళ్లి పీటలెక్కుతారా?

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నయనతార 75వ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ అయిన నీలేష్ కృష్ణా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడం ఖాయమని చిత్ర యూనిట్ అప్పుడే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర మేకర్స్ అనౌన్స్ చేశారు.