Nayanthara: అటు రజని.. ఇటు ధనుష్.. మధ్యలో నయన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీకొచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. కానీ, ఈ వయస్సులోను అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా..

Nayanthara
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీకొచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. కానీ, ఈ వయస్సులోను అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా నటిస్తున్న నయన్ కెరీర్ లో పీక్స్ స్టేజిని అనుభవిస్తుంది. ఒకవైపు ప్రియుడు విగ్నేష్ తో మధుర క్షణాలను చూస్తూనే మరోవైపు కెరీర్ లో కూడా ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నయన్ చేతిలో అరడజను సినిమాలంటే మరో నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అందుకే నయన్ పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటూ వస్తుంది.
Spider Man-No Way Home: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్న స్పైడర్ మ్యాన్!
కాగా, పెళ్లంటే వాయిదా వేసిన నయన్ పెళ్లి తర్వాత భర్త విగ్నేష్ తో కలిసి ఎలా ఉండాలో ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకుంటుంది. అందుకోసమే ఇప్పుడు నయన్ ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. చెన్నైలోని పొయెస్ గార‍్డెన్ అంటే లావిష్ ఏరియా. సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ సీఎం జయలలిత ఇళ్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖుల ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే నయన్ కూడా ఇప్పుడు ఇంటిని కొనుగోలు చేస్తుందట.
Tollywood Crazy Films: క్రేజీ కాంబోలు.. ఎటు చూసినా ప్రమోషన్ల రచ్చే!
పొయెస్ గార‍్డెన్‌లో రజని ఇంటి పక్కనే అల్లుడు ధనుష్ కూడా ఓ డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు. ఇక్కడే నయన్ కూడా ఓ నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. ఈ ఇంటి కోసం నయన్ భారీగానే ఖర్చు చేస్తుందట. తన కన్న కలను నెరవేర్చుకునే సమయం దగ్గర పడిందని తన సన్నిహితులతో చెప్పుకొచ్చిందట నయనతార. పెళ్లి తర్వాత భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఆ ఇంట్లోకి మారనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం.