NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

‘అఖండ’ విజయంతో బాలయ్య సినిమాను భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

Nbk 107

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ 60+లోనూ యంగ్ హీరోలకు గట్టిపోటినిస్తే.. వరుసగా సాలిడ్ సినిమాలు లైనప్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ’ గా నట విశ్వరూపంతో పాటు రికార్డులను ఊచకోత కోస్తూ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చారు.

Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ పేరుతో చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేశారు బాలయ్య. ఫిబ్రవరి 4న ప్రీమియర్ కాబోయే మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఈ సీజన్ ఎండ్ అవుతుంది. తర్వాత గోపిచంద్ మలినేని సినిమాకి షిఫ్ట్ అవుతారు.

Akhanda : 20 ఏళ్ల తర్వాత క్రాస్ రోడ్స్‌లో కోటి కొల్లగొట్టిన బాలయ్య!

Hyderabad Traffic Police : ‘అఖండ’ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బాలయ్యకి థ్యాంక్స్!

శృతి హాసన్ కథానాయిక కన్ఫమ్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘అఖండ’ తో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇంకో హైలెట్ ఏంటంటే.. NBK 107ని నాలుగు భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్నారట.

Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..

Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ బాలయ్య బొమ్మ విడుదలవబోతుంది. తెలుగు సంగతి చెప్పక్కర్లేదు. తమిళ్ ఇండస్ట్రీకి బాలయ్య కొత్తేం కాదు. ఆయన పుట్టి పెరిగింది, నటుడయింది అంతా అక్కడే. సో, తమిళ్‌నాట తిరుగులేదు. ఇక కర్ణాటకలోనూ బాలయ్య మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటసింహానికి తమిళ్, కన్నడ భాషలు వచ్చు కాబట్టి తెలుగుతో పాటు ఆ రెండు లాంగ్వేజెస్‌లో ఆయన డబ్బింగ్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళ్ తర్వాత మలయాళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Pragya Jaiswal : సల్మాన్ ఖాన్‌తో బాలయ్య భామ బాలీవుడ్ రీ ఎంట్రీ..