Acharya : అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి ‘నీలాంబరి’..

‘నీలాంబరి నీలాంబరి.. వేరెవ్వరే నీలా మరి’ అంటూ సాగే ఫీల్‌ గుడ్ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది..

Acharya : అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి ‘నీలాంబరి’..

Neelambari Lyrical Song

Acharya: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. టీజర్, సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

పాండమిక్ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. మణిశర్మ – చిరంజీవి కాంబినేషన్లో ఇంతకుముందు పలు హిట్ సినిమాలొచ్చాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ‘ఆచార్య’ ఆల్బమ్‌తో పాటు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారట స్వరబ్రహ్మ.

Mohan Babu : చిరంజీవి మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే బాగున్నాడు: మోహన్ బాబు

శుక్రవారం సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీలాంబరి’ అంటూ సాంగ్ ఈ లిరికల్ సాంగ్ చక్కటి ఫీల్‌తో ఆకట్టుకుంటోంది. ‘నీలాంబరి నీలాంబరి. వేరెవ్వరే నీలా మరి’ అంటూ అనంతశ్రీరామ్ అందమైన పదాలు రాశారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా అంతే అందంగా పాడారు.