Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లో కనిపించిన లగ్జీరియస్ అండ్ స్టైలిష్ వాచ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

Ram Charan

Updated On : September 8, 2021 / 5:46 PM IST

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబోలో రానున్న RC 15 సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై, మూవీ టీంకి విషెస్ తెలియజేశారు.

Shankar Ram Charan Movie

 

చరణ్, కియారా అద్వానీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరు క్లాప్ నివ్వగా, రణ్‌వీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న గౌరవ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు అందించారు. ఇక ఈ కార్యక్రమంలో చిరు, శంకర్, రాజమౌళి, రణ్‌వీర్‌లు హైలెట్‌గా నిలిచారు.

Ram Charan

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఇంతకుముందు చరణ్ పెట్టుకున్న వాచ్, సన్ గ్లాసెస్‌లకు సంబంధించిన విషయాలతో పాటు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి విషెస్ చెబుతూ చరణ్ షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అయ్యింది. అందులో చరణ్ వేసుకున్న షర్ట్ మీద పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్ గివెన్చీ (Givenchy) సిగ్నేచర్ లోగో ఉండడంతో దాని కాస్ట్ గురించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

Chiru – Charan : మెగా పిక్.. చెర్రీ షర్ట్ కాస్ట్ ఎంతంటే..!

ఇక రీసెంట్‌గా తన కొత్త సినిమా ఓపెనింగ్ సెరమనీలో చరణ్ ధరించిన వాచ్ గురించిన న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్స్‌లో చెర్రీ లగ్జీరియస్ అండ్ స్టైలిష్ రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ (Richard Mille RM 61-01 Yohan Blake) వాచ్‌తో కనిపించారు. ఒలంపిక్స్‌లో 100 ఇంకా 200 మీటర్స్‌లో ప్రపంచ రికార్డ్ సాధించి ఫాస్టెస్ట్ రన్నర్‌గా నిలిచిన యోహన్ బ్లేక్ కోసం రిచర్డ్ మిల్లే కంపెనీవారు ఈ వాచ్‌నిక స్పెషల్‌గా డిజైన్ చేశారన్నమాట.

Richard Mille Rm 61 01 Yohan Blake

ఈ వాచ్‌కి రిస్ట్ రన్ మిషన్ వాచ్‌గా పేరుంది. 50.23 మిల్లీ మీటర్స్ హైట్, 42.70 విడ్త్‌తో హ్యాండ్ వైండింగ్ టైప్ స్కెలిటన్ కాంప్లికేషన్‌లో.. బ్లాక్ రబ్బర్ స్ట్రిప్‌తో.. ఎల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ ఉండడంతో పాటు పైన ఉన్న సాప్ఫైర్ గ్లాస్ ఈ వాచ్‌కి గ్రాండియర్ లుక్ తీసుకొచ్చింది. దీని ధర ఎంతో తెలుసా.. మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 1.02 కోట్లు..! రిచర్డ్ మిల్లే కంపెనీ వాచెస్ ఇంత రేటు ఉండడం మామూలే. ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RC 15 : శంకర్ – రామ్ చరణ్ మూవీ ఓపెనింగ్ ఫొటోస్