Nitu Chandra : భార్యగా ఉంటే నెలకి 25 లక్షలిస్తా అన్నారు.. ఎమోషనల్ అయిన గోదావరి హీరోయిన్..

ఇటీవల ఇంటర్వ్యూలో తన బ్యాడ్ ఫేజ్ గురించి మాట్లాడుతూ.. ''ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించాను. నాది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. ఎంతో మంది జాతీయ అవార్డు అందుకున్న వాళ్ళతో నటించాను. పెద్ద సినిమాల్లో...........

Nitu Chandra : భార్యగా ఉంటే నెలకి 25 లక్షలిస్తా అన్నారు.. ఎమోషనల్ అయిన గోదావరి హీరోయిన్..

Neethu Chandra

Nitu Chandra :  తెలుగులో విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే లాంటి సినిమాలతో మెప్పించిన నీతూ చంద్ర ఆ తర్వాత తెలుగులో కనుమరుగైనా తమిళ్, హిందీలలో సినిమాలు చేస్తుంది. హిందీలో ఎన్నో మంచి సినిమాలలో నటించిన నీతూ చంద్ర గత మూడేళ్ళుగా ఖాళీగా ఉంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది.

Mallika Sherawat : దీపికా పదుకొణె ఇప్పుడు చేసింది నేను 15 ఏళ్ళ క్రితమే చేశా.. అందుకు నన్ను టార్చర్ చేశారు..

ఇటీవల ఇంటర్వ్యూలో తన బ్యాడ్ ఫేజ్ గురించి మాట్లాడుతూ.. ”ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించాను. నాది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. ఎంతో మంది జాతీయ అవార్డు అందుకున్న వాళ్ళతో నటించాను. పెద్ద సినిమాల్లో నటించాను. కానీ ఇటీవల నాకు వర్క్ లేని సమయంలో నాకు డబ్బు అవసరం వచ్చింది. ఇది అదనుగా చూసుకొని ఒక పెద్ద వ్యాపారవేత్త అతని భార్యగా ఉండమని అడిగాడు. అతని భార్యగా ఉన్నందుకు నెలకి 25 లక్షలు ఇస్తానని, నెల నెలా జీతం తీసుకుని భార్యగా ఉండాలని అడిగాడు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పనీ లేదు. అయినా ఆ పని చేయలేను అని చెప్పేశాను. ఇన్ని మంచి సినిమాల్లో నటించాక కూడా ఇప్పుడు నా పొజిషన్ చూసి నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానేమో అనుకుంటున్నాను” అని తెలిపి ఎమోషనల్ అయింది నీతూ చంద్ర.