Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు ఓ పరుగు పందెంలా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం భారీ భారీ సినిమాలను పోటా పోటీగా దక్కించుకోడం.. వెబ్ సిరీస్ లు, షోలతో..

Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

Netflix Prime Video

Netflix-Prime Video: కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు ఓ పరుగు పందెంలా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం భారీ భారీ సినిమాలను పోటా పోటీగా దక్కించుకోడం.. వెబ్ సిరీస్ లు, షోలతో అదరగొడుతున్నాయి. మన తెలుగులో ఆహా ఒక్కటే మాతృ బాష ఓటీటీ కాగా.. జాతీయ స్థాయిలో చాలా సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా వీకెండ్స్, పండగలు, ప్రత్యేక రోజులలో ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకొనేందుకు స్టార్స్ సినిమాలను దక్కించుకుంటూ తమ ప్రభావాన్ని చాటుకుంటున్నాయి.

Ramesh Babu: మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్!

ఒకవిధంగా ఓటీటీ సంస్థల మధ్య పరోక్షంగా పెద్ద యుద్ధమే నడుస్తుంది. అయితే.. రెండు దిగ్గజ సంస్థలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ మధ్య ఈసారి ప్రత్యక్షంగానే యుద్ధం మొదలైంది. అయితే.. ఇది కాస్త ఫన్నీగానే ఉంది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప విషయంలోనే ట్విట్టర్ వేదికగా ఈ ఫన్నీ వార్ జరగడం విశేషం. సుకుమార్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సినిమా థియేట్రికల్ గా బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Ramesh Babu : ముగిసిన ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు

హిందీ మినహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చిన పుష్ప మళ్ళీ అన్ని భాషల్లోనూ అదరగొడుతుంది. అయితే ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో మరో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ ఇండియాకి ప్రైమ్ వీడియో వాళ్ళకి చిన్న ఫన్నీ ట్విట్టర్ వార్ నెటిజన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. శనివారం వీకెండ్ రాత్రి ఏం చూస్తున్నారని నెట్ ఫ్లిక్స్ తమ వీక్షకులని ఓ ప్రశ్న అడిగింది. దానికి అమెజాన్ ప్రైమ్ వీడియో పంచ్ వేస్తూ.. వాళ్ళు మీ యాప్ లో ఇప్పుడేం చూడట్లేదు మా దగ్గర పుష్ప చూస్తూ అంతా బిజీగా ఉన్నారు అని రిప్లై ఇచ్చింది.

Nagarjuna : ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో 6గురు.. ‘బంగార్రాజు’ సినిమాలో 8మంది హీరోయిన్స్

ప్రైమ్ వీడియో చేసిన ఈ రిప్లై ట్వీట్ మంచి వైరల్ అయింది. అయితే ప్రైమ్ వీడియోకు కౌంటర్ ఇస్తూ నెట్ ఫ్లిక్స్ మరో రిప్లై ఇచ్చింది. ‘మరి మేము ఆ అందరిలో ఉన్నామా? ఊ అనం ఊ ఊ కూడా అనం’ అంటూ పుష్ప స్టైల్ లో ఓ ఫన్నీ రిప్లై ఇచ్చింది. రెండు దిగ్గజ సంస్థల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఈ కోల్డ్ వార్ నెటిజన్లకు మంచి ఎంటర్టైనింగ్ గా మారగా.. ఇది ఎంతవరకు వెళ్తుందనే చర్చలు కూడా జరుగుతున్నాయి.