Avatar 2: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వరల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ రిలీజ్!

5,6 భాషల్లో రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా, 7,8 భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అంటున్నారు. మరి 100కు పైగా భాషల్లో ఓ సినిమాని రిలీజ్ చేస్తే..? దాన్నేమంటారు..? అవతార్ పార్ట్ 2 అంటారు. అవతార్.. వరల్డ్ సినిమా హిస్టరీలో అదో అమేజింగ్ మూవీ.

Avatar 2: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వరల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ రిలీజ్!

Avatar 2: 5,6 భాషల్లో రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా, 7,8 భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అంటున్నారు. మరి 100కు పైగా భాషల్లో ఓ సినిమాని రిలీజ్ చేస్తే..? దాన్నేమంటారు..? అవతార్ పార్ట్ 2 అంటారు. అవతార్.. వరల్డ్ సినిమా హిస్టరీలో అదో అమేజింగ్ మూవీ. అప్పట్లో సంచలనం సృష్టించిన అవతార్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న అవతార్ 2 150కు పైగా భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తూ.. వరల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతోంది.

Avatar 2: బాప్ రే.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!

అస్సలు ఆలోచనకు కూడా అందని ప్రపంచం, ఊహించడానికి కూడా దూరంగా ఉన్న అద్బుతమైన సెట్స్, అదిరిపోయే యాక్షన్, అవాక్కయ్యే గ్రాఫిక్స్, అన్నీ కలిపితే అవతార్ సినిమా. అంతకుముందు చూడని గ్రాఫికల్ వరల్డ్ ని అవతార్ తో చూపించి డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ ఇప్పటికీ వరల్డ్ నెంబర్ వన్ మూవీగా కంటిన్యూ అవుతోంది. ఇలాంటి క్రేజీ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అవతార్ సెకండ్ పార్ట్ మీద ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది టీమ్. లేటెస్ట్ గా డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న అవతార్ 2ని నెవర్ బిఫోర్ రేంజ్ లో ఏకంగా 160 భాషల్లో ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ రివీల్ చేసి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు అవతార్ టీమ్.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

అవతార్‌ 2 డిసెంబర్‌ 16, 2022న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అది కూడా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ అవుతోందని వరల్డ్ వైడ్ గా టాక్ నడుస్తోంది. రిలీజ్ అంటే అలాంటి ఇలాంటి రిలీజ్ కాదు.. వరల్డ్ సినిమా మొత్తం షాక్ అయ్యేలా.. అవతార్ 2 ని త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్‌లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది అవతార్ టీమ్. అసలు అవతార్ సినిమాలోనే అద్బుతమైన విజువల్స్ తో పాటు.. అసలు ఊహకు కూడా అందని గ్రాఫిక్స్ ని చూపించిన జేమ్స్.. అవతార్ సీక్వెల్స్ లో అంతకుమించి విజువల్ వండర్స్ ఉంటాయంటూ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని ఇంకా పెంచేశారు.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

ఫస్ట్ పార్ట్ లో చూపించిన పాండోరాని మించిన విజువల్ ఫీస్ట్ రెడీ అవుతోందని చెప్పిన కామెరూన్ అవతార్ 2 సినిమాలో అసలు ఇమాజిన్ చెయ్యలేని ఫీట్స్ కూడా చూపించబోతున్నారు. ఒక్కో షాట్ ని అద్బుతంగా తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్.. అండర్ వాటర్ లోనే ఎక్కువభాగం షూటింగ్ చేశారు. అవతార్ లో చూపించిన అద్బుతమైన పాండోరాని ఈ అవతార్ 2, 3లో కంప్లీట్ గా కొత్తగా చూస్తారని అవతార్ అఫీషియల్ వెబ్ సైట్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. ఈ సంవత్సరం డిసెంబర్ 16న రిలీజ్ అవ్వబోతున్న అవతార్ 2 లో జస్ట్ పాండోరాని చూడడమే కాదు.. ప్రపంచం మొత్తాన్ని చూపించబోతున్నట్టు న్యూస్.