Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

దేశ, భాష బేధం లేకుండా వచ్చిన అన్ని చిత్రాలను ఆదరిస్తున్నారు భారతీయులు. ఓ వైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే థియేటర్ లకు వస్తున్నారు ప్రేక్షకులు

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

Movies

Hollywood Movies: ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం “స్పైడర్ మ్యాన్-No Way Home” చిత్రం థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల డాలర్ల కాసుల వర్షం కురిపించింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో సూపర్ యాక్షన్ చిత్రాలు లేక ఉసూరుమంటున్న సినీ ప్రేక్షకులు.. ఒక్కసారిగా స్పైడర్ మ్యాన్ చిత్రాన్ని ఆదరించిన తీరు అదరహో. మిగతా దేశాల కంటే భారత్ లోనే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలవడం విశేషం. దేశ, భాష బేధం లేకుండా వచ్చిన అన్ని చిత్రాలను ఆదరిస్తున్నారు భారతీయులు. ఓ వైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే థియేటర్ లకు వస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ ఏడాది మరిన్ని చిత్రాలను భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు హాలీవుడ్ నిర్మాతలు. 2022లో రానున్న టాప్ హాలీవుడ్ చిత్రాలు ఏంటంటే..

‘The Batman’: Batman ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది మార్చిలో విడుదల కానుంది. హాలీవుడ్ హార్ట్ త్రోబ్.. రాబర్ట్ పాటిన్సన్ ఈ సూపర్ హీరో పాత్రను పోషించాడు. గోథమ్ సిటీని విలన్ల భారీ నుంచి రక్షించేందుకు batman చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. “The Batman” చిత్రంలో ఈసారి Catwoman కూడా కనిపించనుంది. వీరిద్దరూ చేసే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దల్ని చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: Taliban’s: తాలిబన్ల పిచ్చి పరాకాష్టకు: షోరూంల్లో బొమ్మల తలలు నరికేస్తున్న వైనం

‘Doctor Strange in the Multiverse of Madness’: మార్వెల్ చిత్రాల్లో కొనసాగింపుగా వస్తున్నా డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం పైనా ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. కథాబలం, యాక్షన్ సన్నివేశాలు కలగలిపి వస్తున్న ఈ చిత్రంలో బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్, ఎలిజబెత్ ఒల్సెన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘Jurassic World: Dominion’: జురాసిక్ పార్క్ చిత్రాలకు కొనసాగింపుగా వచ్చిన జురాసిక్ వరల్డ్ చిత్రాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి. దీంతో ఈ ఫ్రాంచైజీలో కొనసాగింపుగా మూడో చిత్రం ‘Jurassic World: Dominion’ చిత్రం ఈ ఏడాదిలో రానుంది. జురాసిక్ పార్కులోని డైనోసార్ల వలన భూమిపై మనుషుల మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుంది. దీంతో వాటి నుంచి మనుషులు ఎలా తప్పించుకున్నారు అనేది ఈచిత్ర కథాంశం. గత రెండు చిత్రాల్లో నటించిన క్రిస్ ప్రాట్, బ్రైస్ హోవార్డ్ ఈ చిత్రంలోనూ ప్రధాన పాత్ర పోషించారు.

‘Mission Impossible 7’: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్.. తన Mission Impossible ఫ్రాంచైజీలో 7వ భాగంగా వస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలలో టామ్ క్రూయిజ్ తన స్టంట్ లను తానే స్వయంగా చేస్తుంటాడు. Mission Impossible 7కు సంబంధించి టామ్ క్రూయిజ్ చేసిన కొన్ని స్టంట్స్ కు సంబంధించి షూటింగ్ సీన్లను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ చేజింగ్ లు, పెద్ద పెద్ద భవనాలపై టామ్ క్రూయిజ్ చేస్తున్న ఆ స్టంట్స్ చూసి వెన్నులో ఒణుకు పుట్టింది. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది.

Also read: Shahrukh Khan: దేశంపై నమ్మకాన్ని ఇనుమడింపజేసిన షారుఖ్ అభిమానం

‘Spider-Man Across the Spider-Verse’: స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ఆదరణ ఎంతలా ఉంటుందో తెలిసిందే. దీంతో ఆ కథల్లో కొన్నిటిని యానిమేషన్ చిత్రాలుగా తీసుకొచ్చారు. 2018లో వచ్చిన ‘Spider-Man into Spider-Verse, చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ఈ యానిమేటెడ్ సిరీస్ కు కొనసాగింపుగా ఇప్పుడు ‘Spider-Man Across the Spider-Verse’ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయనున్నారు.

Black Panther: Wakanda Forever: మార్వెల్ సూపర్ హీరో చిత్రాల్లో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది బ్లాక్ పాంథర్ చిత్రం. 2018లో వచ్చిన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని నిర్మించారు. Black Panther: Wakanda Forever గా వస్తున్న ఆ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. ఈచిత్రం షూటింగ్ సమయంలోనే కథానాయకుడు చద్విక్ బొస్మాన్ కాన్సర్ తో మృతి చెందారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Avatar 2: ఇక హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచమంతా ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ 2. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిచిన అవతార్ మొదటి భాగం 2009లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టించింది. దీంతో అవతార్ కు వరుసగా సీక్వెల్స్ సిద్ధం చేసాడు దర్శకుడు జేమ్స్ కెమెరాన్. అవతార్ 2ని డిసెంబర్ లో విడుదల చేయనుండగా, అవతార్ 3ని 2023లో విడుదల చేయనున్నారు

Also read: Yamaha FZS-Fi: సరికొత్త హంగులతో వచ్చిన Yamaha FZS-Fi, రేటు ఎంతంటే??