RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..

మార్చ్ 25న ఈ సినిమాని ప్రకటించి ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అయితే ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టారు. ఈ సారి ఆ రేంజ్ లో కాకపోయినా ప్రమోషన్స్......

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..

Rrr

RRR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మార్చ్ 25న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు సైతం ఈ సినిమాలో నటించారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

మార్చ్ 25న ఈ సినిమాని ప్రకటించి ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అయితే ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టారు. ఈ సారి ఆ రేంజ్ లో కాకపోయినా ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే చేద్దామని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం అంతటా ‘రాధేశ్యామ్’ సినిమా హవా నడుస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారని సమాచారం. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కొత్త పాట రానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Varun Dhawan : బాలీవుడ్ స్టార్‌తో కలిసి బీచ్‌లో ‘హ‌ల‌మితి హ‌బిబో’ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన రష్మిక

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మార్చ్ 14న ఎత్తరా జెండా అనే పాటని విడుదల చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సెలెబ్రేషన్ యాంతం అంటూ ఈ పాటని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియాభట్ ఓ డ్యాన్స్ ఫోజుతో ఉన్నారు. ఒక మంచి దేశభక్తి గీతంలా ఈ సాంగ్ ఉండబోతుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ పాట రిలీజ్ తర్వాత నుంచి ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు చిత్ర యూనిట్. ఇక సినిమా కోసం అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు.