Varun Dhawan : బాలీవుడ్ స్టార్‌తో కలిసి బీచ్‌లో ‘హలమితి హబిబో’ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన రష్మిక
విజయ్, పూజాహెగ్డే జంటగా రానున్న 'బీస్ట్' సినిమాలోని 'హలమితి హబిబో' సాంగ్ ఇటీవల బాగా పాపులర్ అయింది. స్టార్లు సైతం ఈ సాంగ్ కి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు.....

Rashmika
Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ‘పుష్ప’ సినిమా తర్వాత దేశమంతటా రష్మికకి క్రేజ్ పెరిగిపోయింది. రష్మిక తెలుగు, తమిళ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సినిమా షూట్ లో ఉంది. అయితే ఈ సినిమా షూట్ గ్యాప్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విజయ్ ‘హలమితి హబిబో’ సాంగ్ కి డ్యాన్స్ వేసింది.
Butterfly : సింగర్‌గా అనుపమ పరమేశ్వరన్..
విజయ్, పూజాహెగ్డే జంటగా రానున్న ‘బీస్ట్’ సినిమాలోని ‘హలమితి హబిబో’ సాంగ్ ఇటీవల బాగా పాపులర్ అయింది. స్టార్లు సైతం ఈ సాంగ్ కి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా రష్మిక కూడా ఈ సాంగ్ కి వరుణ్ ధావన్ తో కలిసి స్టెప్పులు వేసింది. ఓ బీచ్ లో షూటింగ్ జరుగుతుండగా షూటింగ్ గ్యాప్ లో వరుణ్ తో కలిసి ‘హలమితి హబిబో’ సాంగ్ కి డ్యాన్స్ వేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక. వరుణ్ ధావన్ కూడా ఆ వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మరోసారి రష్మికని అభిమానులు, నెటిజన్లు డ్యాన్స్ అదరగొట్టింది అంటూ పొగిడేస్తున్నారు.