Butterfly : సింగర్‌గా అనుపమ పరమేశ్వరన్..
తాజాగా అనుపమ సింగర్ గా మారింది. అనుపమ లేడీ ఓరియెంటెడ్ లో రాబోతున్న ‘బటర్‌ఫ్లై’ సినిమాలో ఒక సాంగ్ పాడింది. ఈ సినిమా నుంచి ‘‘ఆల్ ద లేడీస్..’’ అనే గీతాన్ని ఇటీవల మహిళా దినోత్సవం....

Anupama
Anupama Parameswaran : ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నితిన్ నటించిన ‘అ ఆ’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు చేస్తూ వస్తుంది. ఇటీవలే ‘రౌడీ బాయ్స్’ సినిమాలో లిప్ కిస్, రొమాన్స్ సన్నివేశాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ‘బటర్‌ఫ్లై’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. హీరోయిన్ గా ఒక పక్క మెప్పిస్తునే మరోపక్క సోషల్ మీడియాలో రీల్స్, డ్యాన్స్, ఫొటోలతో అలరిస్తుంది. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడి తన సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తుంది.
Shalini Pandey : మరోసారి రెచ్చిపోయి ఫోజులిచ్చిన అర్జున్ రెడ్డి భామ
తాజాగా అనుపమ సింగర్ గా మారింది. అనుపమ లేడీ ఓరియెంటెడ్ లో రాబోతున్న ‘బటర్‌ఫ్లై’ సినిమాలో ఒక సాంగ్ పాడింది. ఈ సినిమా నుంచి ‘‘ఆల్ ద లేడీస్..’’ అనే గీతాన్ని ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఈ పాట ఉంటుంది. ఈ పాటని అనంత్ శ్రీరామ్ రాయగా, అరవింద్ షారోన్ మ్యూజిక్ అందించారు. ఈ పాటని అనుపమ పరమేశ్వరన్ స్వయంగా పాడింది. దీంతో అనుపమ నటిగానే కాక సింగర్ గా కూడా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. అనుపమ అభిమానులు అయితే సోషల్ మీడియాలో తనని పొగుడుతూ పోస్టులు చేస్తున్నారు.