Nidhhi Agerwal : కండోమ్ యాడ్‌ని ప్రమోట్ చేసిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ తాజాగా ఓ కండోమ్ యాడ్ ని ప్రమోట్ చేసింది. అంతే కాక ఆ కండోమ్ గురించి చెప్తూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఆ కండోమ్ ప్రత్యేకతలు చెప్తూ ప్రమోట్....

Nidhhi Agerwal : కండోమ్ యాడ్‌ని ప్రమోట్ చేసిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Nidhi

Nidhhi Agerwal :  ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు డబ్బుల కోసం ఎలాంటి కమర్షియల్ యాడ్ అయినా ప్రమోట్ చేసేస్తున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు డబ్బుల కోసం. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ యాడ్స్ ట్రోలింగ్ కి గురవుతున్నాయి. ఆ యాడ్స్ చేసిన సెలబ్రిటీలని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ చేసిన యాడ్స్ బాగా ట్రోల్ అయ్యాయి. తాజాగా ఓ హీరోయిన్ కండోమ్ యాడ్ ని ప్రమోట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ హీరోయిన్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

 

ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ తాజాగా ఓ కండోమ్ యాడ్ ని ప్రమోట్ చేసింది. అంతే కాక ఆ కండోమ్ గురించి చెప్తూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఆ కండోమ్ ప్రత్యేకతలు చెప్తూ ప్రమోట్ చేసింది. యాడ్ ని ప్రమోట్ చేయడం వరకు ఓకే కానీ ఇలా కండోమ్ గురించి మాట్లాడుతూ తనే వీడియో స్వయంగా చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది.

Kadambari Kiran : బంగారు స్పూన్‌తో పుట్టడం వేరు.. బంగారు మనసుతో బతకడం వేరు.. చరణ్ మంచితనంపై ప్రశంసలు

ఈ కండోమ్ ప్రమోషన్ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. మీరు ఇలాంటి యాడ్స్ ప్రమోట్ చేస్తారని అనుకోలేదు, మీరు అంత కరెక్ట్ గా ఎల్ చెప్తున్నారు, మీరు వాడి చూశారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది వాట్ ఏ డేరింగ్ యాడ్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. గతంలోని నిధి అగర్వాల్ ఓ ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేయగా అప్పుడు కూడా ట్రోలింగ్ ఎదుర్కొంది. అయినా ఈ యాడ్ చేయడంతో డబ్బుల కోసం ఎలాంటి యాడ్స్ పడితే అలాంటి యాడ్స్ చేస్తారా అంటూ మరింత ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.