Kadambari Kiran : బంగారు స్పూన్‌తో పుట్టడం వేరు.. బంగారు మనసుతో బతకడం వేరు.. చరణ్ మంచితనంపై ప్రశంసలు

చరణ్ తో ఉన్న ఫోటోలని షేర్ చేసి.. ''మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నేను తెలుసుకున్న ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషి, భక్తి, ప్రేమ, గౌరవం........

Kadambari Kiran : బంగారు స్పూన్‌తో పుట్టడం వేరు.. బంగారు మనసుతో బతకడం వేరు.. చరణ్ మంచితనంపై ప్రశంసలు

Charan

 

Ram Charan :  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే కాక, బయట కూడా ఎంతో మందికి సహాయం చేస్తారు చిరంజీవి. తన వద్దకు సహాయం కావాలని వచ్చిన వారిని ఖాళి చేతులతో పంపరు. ఆయన గుణాలే తనయుడు చరణ్ కి కూడా వచ్చాయి. చరణ్ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ మంచితనం గురించి చాలా మంది ప్రశంసించారు. ఇటీవల ఉక్రెయిన్ లో కూడా పలువురికి చరణ్ సాయం చేసిన సంగతి తెలిసిందే

 

తాజాగా చరణ్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు నటుడు, సామజిక కార్యకర్త కాదంబరి కిరణ్. మనం సైతం అనే ఫౌండేషన్ తో ఇండస్ట్రీలో ఉండే పేద కార్మికులకు, కళాకారులకు సహాయం చేస్తూ ఉంటారు కాదంబరి కిరణ్. కొంతకాలం క్రితం రామ్ చరణ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కి సహాయం చేశారు. ఈ సహాయం కాదంబరి కిరణ్ ద్వారా చేశారు. ప్రస్తుతం కిరణ్ చరణ్ – శంకర్ సినిమాలో నటిస్తున్నారు. దీంతో అప్పటి విషయాన్ని గురించి చరణ్ స్వయంగా మాట్లాడటంతో ఆయన మంచితనాన్ని పొగుడుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Radhika : చిరంజీవిని చెంప మీద 23 సార్లు కొట్టాను.. ఎర్రగా వాచిపోయింది..

చరణ్ తో ఉన్న ఫోటోలని షేర్ చేసి.. ”మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నేను తెలుసుకున్న ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషి, భక్తి, ప్రేమ, గౌరవం.. ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్ ని సాయం అడిగి 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాము. అవి కాక మరికొంతమంది వద్ద లక్షా ఇరవై వేల రూపాయల వరకు పోగుచేసి ఆ చనిపోయినామెకు నెలల పాప ఉండటంతో ఆ పాప పేరున FD చేయమని ఇచ్చాం.”

YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..

”ఇప్పుడు ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్ చరణ్ “ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?” అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోసారి చరణ్ మంచితనాన్ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.