YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..

సల్మాన్ ఖాన్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం సౌత్ లో ఎందుకు వర్కవుట్‌ అవడం లేదో అర్ధం కావట్లేదు......

YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..

Yash

 

Yash :  ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే భారీ సినిమాలు, కోట్లలో కలెక్షన్లు, సినీ పరిశ్రమని శాసిస్తారు అని చెప్పేవారు. కానీ అదంతా గతం. ఇప్పుడు అంతా సౌత్ సినిమాలదే రాజ్యం. సౌత్ సినిమాలు వరుసగా ఇక్కడ, బాలీవుడ్ లో విజయాలు సాధిస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలని మించి సౌత్ సినిమాలు కలెక్షన్స్ సాధిస్తున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం సౌత్ లో ఎక్కువగా ఆడట్లేదు. అసలు కొన్ని హిందీ సినిమాలని అయితే సౌత్ లో పట్టించుకోవట్లేదు కూడా.

 

ఇటీవల దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడారు. సల్మాన్ ఖాన్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం సౌత్ లో ఎందుకు వర్కవుట్‌ అవడం లేదో అర్ధం కావట్లేదు” అని అన్నారు. రేపు ‘కెజిఎఫ్ 2’ సినిమా విడుదల ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో హీరో యశ్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. ఓ విలేఖరి సౌత్ సినిమాలు హిందీలో ఆడుతున్నాయి, హిందీ సినిమాలు మాత్రం సౌత్ లో ఆడట్లేదు అని సల్మాన్ అన్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని హీరో యశ్ ని అడిగారు.

Chiranjeevi: చిరుతో సాయి ధరమ్ మల్టీస్టారర్.. తనయుడిగా మేనల్లుడు?

దీనిపై హీరో యశ్ మాట్లాడుతూ.. ”సల్మాన్‌ ఖాన్‌ అభిప్రాయం తప్పు. చాలా కాలంగా సౌత్ సినిమాలను హిందీలో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల సౌత్‌ సినిమాలు హిందీ ప్రేక్షకులకు చేరువయ్యాయి. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా బాగుంటే ఆదరిస్తున్నారు కానీ ఇది ఏ ప్రాంతానికి చెందిన సినిమా అని చూడట్లేదు. రాజమౌళి బాహుబలిని డైరెక్ట్‌గా రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత మేము కూడా కేజీఎఫ్‌ విషయంలో అదే చేశాము. అయితే మేము సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తాము, అప్పుడే అది జనాల్లోకి వెళ్తుంది. కానీ హిందీ సినిమాలు ఇక్కడ డబ్ చేసి రిలీజ్‌ చేసి వదిలేస్తారు, ప్రమోషన్ చేయకపోవడం వాళ్ళ అది జనాలకి రీచ్ అవ్వదు. అందుకే చాలా వరకు హిందీ సినిమాలు సౌత్ లో ఆడవు, కానీ కంటెంట్ బాగుంటే మన వాళ్ళు కూడా అన్ని సినిమాలని ఆదరిస్తారు” అని తెలిపారు.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

మరి యశ్ చెప్పిన మాటలను బాలీవుడ్ సీరియస్ గా తీసుకుంటుందా?? సీరియస్ గా తీసుకొని ఇప్పటినుంచి రిలీజ్ అయ్యే సినిమాలని సౌత్ లో బాగా ప్రమోట్ చేస్తారా లేక ఇదవరికి లాగే వదిలేస్తారా చూడాలి మరి. యశ్ మరోసారి కెజిఎఫ్ 2 తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించడానికి రెడీ అయిపోయాడు.