NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించి దూసుకుపోతుంది.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

Jr Ntr Alia

NTR30: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించి దూసుకుపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా ఇప్పుడు అలియా భట్ పేరే వినిపిస్తోంది. మన టాలీవుడ్ లో కూడా అలియాభట్ తమ హీరోయిన్ కావాలనే స్టార్ హీరోల లిస్ట్ పెరిగిపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో గంగూభాయ్ కతియావాడితో ప్రేక్షకుల ముందుకొచ్చిన అలియా.. పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా పేరు దక్కించుకుంది.

NTR30: తారక్ అక్కగా సోనాలీ రీఎంట్రీ!

ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివ దర్శకత్వం ఎన్టీఆర్ నటించే రెండో సినిమా కోసం కూడా అలియాను ఫైనల్ చేశారు. అలియా ఇప్పటికే ఈ విషయాన్ని కూడా ప్రకటించగా.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. అయితే.. ఇంతలోనే అలియా పెళ్లి చేసుకోబోతుందని టాక్ మొదలైంది. అతికొద్ది మంది సన్నిహితుల మధ్యన అలియా రణబీర్ కపూర్ ను డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతుందని బాలీవుడ్ కోడై కూస్తుంది.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

రణబీర్-అలియాల పెళ్లి ఈ నెల 20 తర్వాత జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుండగా.. జూన్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. సరిగా నెల వ్యవధిలోనే అలియా షూటింగ్ కి అటెండ్ కావడం కష్టమే. అందుకే పెళ్లి కోసం అలియా ఎన్టీఆర్ సినిమా నుండి తప్పుకున్నట్లు టాక్ నడుస్తుంది. అలియా పేరును అధికారికంగా ప్రకటించలేదు కనుక.. ఇప్పుడు తప్పుకున్నట్లు కూడా ప్రకటించాల్సిన పనిలేదని భావిస్తున్న కొరటాల అండ్ కో.. త్వరలోనే అలియా స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసి ప్రకటించనున్నారట.