NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ 30వ సినిమా. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి..

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

#ntr30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ 30వ సినిమా. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన తారక్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో ముందుగా కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది.

Tollywood : జగన్‌తో కమెడియన్ అలీ ప్రత్యేక భేటీ..

గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనుండగా మరింత పగడ్బంధీగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా అసలు కథ ఇదే అంటూ ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మూఢనమ్మకాలతో మనుషులు ఎలా పక్కదారి పడుతూ.. తమని తాము ఎలా హింసించుకుంటున్నారో అనే కోణంలో ఈ సినిమా కథాంశం ఉంటుందట.

Manchu Vishnu: విజయవాడకు మంచు విష్ణు.. కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ..!

సహజంగానే కొరటాల శివ సినిమాలో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ఇంటెర్నెల్ గా లింకై ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ సినిమా పొలిటికల్ నేపథ్యంలో సాగే కథ కాగా ఇంటెర్నెల్ గా మూఢనమ్మకాలతో మనుషులు ఎలా పక్కదారి పడుతున్నారనే అంశాన్ని హైలెట్ చేయనున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా రెగ్యులర్ షూటింగ్ కోసం యూనిట్ సిద్దమవుతుంది.