Tollywood : జగన్‌తో కమెడియన్ అలీ ప్రత్యేక భేటీ..

ఇదే నేపథ్యంలో కమెడియన్ అలీ కూడా ఏపీ సీఎం జగన్ ని ఇవాళ కలవనున్నారు. ఇప్పటికే విజయవాడకి చేరుకున్న అలీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు ఆఫీస్ లో జగన్ ని కలవనున్నారు. అయితే ప్రభుత్వమే..

Tollywood :  జగన్‌తో కమెడియన్ అలీ ప్రత్యేక భేటీ..

Ali

Updated On : February 15, 2022 / 7:03 PM IST

CM Jagan :  టాలీవుడ్ సినీ సమస్యల పరిష్కారానికి, ఏపీ ప్రభుత్వంతో ఇటీవల చిరంజీవితో సహా మరి కొంతమంది సినీ పెద్దలు సమావేశమయ్యారు. జగన్ తో, పేర్ని నానితో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే జగన్ మంచి వార్త చెప్తా అన్నారని చెప్పారు. త్వరలోనే సినీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు.

అయితే చిరంజీవితో కలిసి టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావడం, తర్వాత మంత్రి పేర్ని నాని మోహన్ బాబు ఇంటికి వెళ్లి మాట్లాడ్డం, ఆ విషయంపై మంచు విష్ణు ట్వీట్ చేయడం, తర్వాత ఆ ట్వీట్ ని మార్చడం, తర్వాత పేర్ని నాని మీడియాతో మోహన్ బాబుతో కలవడం పై మాట్లాడటం.. ఇలా ఒకదానివెంట మరోటి ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరుగుతూ వచ్చాయి.

తాజాగా ఇవాళ టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏపీ సీఎం జగన్ తో మరికొద్దిసేపట్లో సమావేశమవ్వనున్నారు. ‘మా’ ప్రెసిడెంట్ అయినా ఇప్పటివరకు ఇండస్ట్రీ సమస్యలకు స్పందించకుండా, ఇండస్ట్రీ ప్రముఖులతో మాట్లాడకుండా, చిరంజీవిని సొంత ప్రయోజనాల కోసం కలిసారని అనడం.. ఇలాంటి వాటి మధ్య ఇవాళ మంచు విష్ణు జగన్ ని కలవడంతో ఈ సమావేశం మరింత ఆసక్తిగా మారనుంది.

Manchu Vishnu: విజయవాడకు మంచు విష్ణు.. కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ..!

ఇదే నేపథ్యంలో కమెడియన్ అలీ కూడా ఏపీ సీఎం జగన్ ని ఇవాళ కలవనున్నారు. ఇప్పటికే విజయవాడకి చేరుకున్న అలీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు ఆఫీస్ లో జగన్ ని కలవనున్నారు. అయితే ప్రభుత్వమే అలీని పిలిచిందా, లేక ఆలీనే వెళ్ళారా? వైఎస్సార్సీపీ పార్టీలో అలీ కూడా ఉన్నారు కాబట్టి పిలిచారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మొన్న చిరంజీవితో అలీ కూడా హాజరయ్యారు. మళ్ళీ అలీ ఒక్కరే ఎందుకు కలుస్తున్నారు అని సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న జరిగిన భేటీపై ఆలీకి గుడ్ న్యూస్ ఏమైనా చెప్తారా అంటూ ప్రచారం సాగుతుంది.

Shankar : ‘రోబో’ సినిమా స్పూర్తితో ‘అవెంజర్స్’ సీన్స్ తీశాము : అవెంజర్స్ డైరెక్టర్

ఒకే రోజు టాలీవుడ్ లోని ఇద్దరికీ సీఎం జగన్ వేరు వేరు అప్పాయింట్మెంట్స్ ఇవ్వడంతో ఇవాళ ఏం జరుగుతుందని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.