Shankar : ‘రోబో’ సినిమా స్పూర్తితో ‘అవెంజర్స్’ సీన్స్ తీశాము : అవెంజర్స్ డైరెక్టర్

తాజాగా 'రోబో' సినిమాపై 'అవెంజర్స్' డైరెక్టర్ ప్రశంశలు కురిపిస్తూ రోబో సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన తర్వాతే అవెంజర్స్ లోని సన్నివేశాలను తీశాము అని తెలిపారు. ‘అవెంజర్స్‌...........

Shankar : ‘రోబో’ సినిమా స్పూర్తితో ‘అవెంజర్స్’ సీన్స్ తీశాము : అవెంజర్స్ డైరెక్టర్

Robo

Robo :  విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో సినిమా తీయాలంటే హాలీవుడ్‌ తర్వాతే ఎవరైనా. అక్కడ తీసే ప్రతి సినిమాలోనూ ఎక్కువ శాతం గ్రాఫిక్స్ ఉంటాయి. అంతటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ భారతదేశానికి పరిచయం చేసింది మాత్రం డైరెక్టర్ శంకర్. రోబో సినిమాతో హై లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ ని ఇండియాకి పరిచయం చేశారు శంకర్. రజినీకాంత్ హీరోగా వచ్చిన రోబో, రోబో 2 ఎంత భారీ విజయాలు సాధించాయి అందరికి తెలిసిందే. ఈ గ్రాఫిక్స్ అన్ని కూడా శంకర్ హాలీవుడ్ లోనే చేయించాడు. రోబో విజువల్ ఎఫెక్ట్స్ కి హాలీవుడ్ నుంచి కూడా ప్రశంశలు వచ్చాయి.

తాజాగా ‘రోబో’ సినిమాపై ‘అవెంజర్స్’ డైరెక్టర్ ప్రశంశలు కురిపిస్తూ రోబో సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన తర్వాతే అవెంజర్స్ లోని సన్నివేశాలను తీశాము అని తెలిపారు. ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ డైరెక్టర్స్ లో ఒకరైన జోసెఫ్‌ రూసో ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ చిత్రంలోని ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని శంకర్‌ ‘ఎంతిరన్‌’ సినిమా నుంచి చూసి ఇన్స్పిరేషన్ అయి తీశాను” అని చెప్పారు.

Manjima Mohan : యువ నటుడితో హీరోయిన్ మంజిమా మోహన్ సహజీవనం?

దీంతో హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మన ఇండియా డైరెక్టర్ ని పొగుడుతూ మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది. జోసెఫ్ రూసో శంకర్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శంకర్ ని పొగుడుతున్నారు. జోసెఫ్‌ రూసో, ఆంటోనీ రూసో కలిసి తమిళ నటుడు ధనుష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘ది గ్రే మ్యాన్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.