Manjima Mohan : యువ నటుడితో హీరోయిన్ మంజిమా మోహన్ సహజీవనం?

2019లో గౌతమ్‌ కార్తీక్ హీరోగా తెరకెక్కిన ‘దేవరాట్టం’ సినిమాలో మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత........

Manjima Mohan :  యువ నటుడితో హీరోయిన్ మంజిమా మోహన్ సహజీవనం?

Manjima (1)

Updated On : February 15, 2022 / 11:01 AM IST

Manjima Mohan :  బాలనటిగా కెరీర్‌ ఆరంభించి తమిళ్ లో ‘ఒరు వాడక్కన్ సెల్ఫీ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్‌. కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు కార్తిక్‌ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమ్‌ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’తో వెండితెరకు పరిచయమయ్యాడు.

2019లో గౌతమ్‌ కార్తీక్ హీరోగా తెరకెక్కిన ‘దేవరాట్టం’ సినిమాలో మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే తాజాగా తమిళ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

Shanmukh Jaswanth : బిగ్‌బాస్ లాంటి షోలో నేను సెట్ అవ్వను.. నా మీద చాలా నెగిటివిటీ వచ్చింది..

ప్రస్తుతం గౌతమ్, మంజిమా ఇద్దరూ చెన్నైలోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు, కలిసి చక్కర్లు కొడుతున్నట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. అయితే త్వరలోనే వీరు దీనిపై స్పష్టత ఇస్తారని తెలుస్తుంది. మరి కెరీర్ ఆరంభంలో ఉన్నప్పుడే ఇలా లవ్ లో మునిగిపోతే పెళ్లి చేసుకుంటారా లేక కేవలం డేటింగ్ తో ఆపేస్తారా చూడాలి మరి. .