Nidhi-Simbu: శింబుతో నిధి పెళ్లి.. త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌‌మెంట్?

కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి దాదాపుగా సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ తో డేటింగ్, ప్రేమాయణం, ఎఫైర్స్ సాగించిన ఈ హీరో అందులో ఎవరితోనూ..

Nidhi-Simbu: శింబుతో నిధి పెళ్లి.. త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌‌మెంట్?

Nidhi Simbu

Nidhi-Simbu: కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి దాదాపుగా సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ తో డేటింగ్, ప్రేమాయణం, ఎఫైర్స్ సాగించిన ఈ హీరో అందులో ఎవరితోనూ పర్మనెంట్‌గా ఉండిపోలేదు. తప్పు శింబులో ఉందా.. ప్రేమించిన ఆ హీరోయిన్స్ లో ఉందా అన్నది ఎవరికీ తెలియదు కానీ శింబుకు మాత్రం అక్కడ ప్లే బాయ్ గా ముద్రపడింది. కాగా ఇప్పుడు శింబు ఖాతాలో మరో హీరోయిన్ చేరినట్లు కథనాలొస్తున్నాయి. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ తో శింబు ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా కథనాలు వినిపిస్తున్నాయి.

Nidhi Agarwal: దిమాక్ ఖరాబ్ చేస్తున్న అందాల ‘నిధి’!

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్, కోలీవుడ్‌లో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోన్న నిధి అగర్వాల్.. శింబు హీరోగా నటించిన ‘ఈశ్వరన్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. ఈశ్వరన్ సినిమా తరవాత నిధి ఎప్పుడు చెన్నై వెళ్లినా శింబు ఇంట్లోనే మకాం వేసేదని.. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని కూడా తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తూ వస్తుంది. కాగా ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

Simbu: వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు.. ఇబ్బంది పెడుతున్నదెవరు?

ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించగా.. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. శింబు-నిధి ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. అయితే.. రెండేళ్లుగా వీళ్ళ ప్రేమ వార్తలు ఎంతగా వచ్చినా ఈ ఇద్దరి నుండి ఎలాంటి స్పందన లేదు. శింబు కుటుంబం కూడా ఈ అంశంపై నోరు మెదపలేదు. మరి ఆ పెళ్లి వార్త ఎప్పుడొస్తుందో!