Niharika : షార్ట్ హెయిర్, షార్ట్ నిక్కర్‌తో జిమ్‌లో నిహారిక.. పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం బయటకి..

పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటిదాకా బయట కనపడలేదు నిహారిక. తాజాగా నిహారిక జిమ్ లో ఉన్న ఫోటోలు బయటకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో షార్ట్ హెయిర్ తో............

Niharika : షార్ట్ హెయిర్, షార్ట్ నిక్కర్‌తో జిమ్‌లో నిహారిక.. పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం బయటకి..

Niharika

 

Niharika Konidela :  మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని చాలానే ట్రై చేసింది. టీవీ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఆర్టిస్ట్, హీరోయిన్ గా, నిర్మాతగా ఇలా బిజీ సెలబ్రిటీగా అయింది నిహారిక. సడెన్ గా చైతన్యని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకున్నా కూడా నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుంది.

 

అయితే ఇటీవల నిహారిక పేరు వార్తల్లో బాగా వినపడింది. హైదరాబాద్ లో జరిగిన పబ్ ఇన్సిడెంట్ లో నిహారిక పోలీస్ స్టేషన్ లో ఉండి రావడంతో బాగా వైరల్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కూడా డిలీట్‌ చేయడంతో పాటు తన భర్తతో గొడవలు అయ్యాయంటూ వార్తల్లో, సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది నిహారిక. ఇక ఆ పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటిదాకా బయట కనపడలేదు నిహారిక. నిహారిక గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

Sanjjanaa Galrani : ప్రభాస్ హీరోయిన్‌కి శ్రీమంతం.. ఫ్రెండ్స్ చేశారంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా నిహారిక జిమ్ లో ఉన్న ఫోటోలు బయటకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో షార్ట్ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపించింది. ఇక షార్ట్ నిక్కర్ తో మోడ్రన్ జిమ్ డ్రెస్ లో తన ట్రైనర్ తో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నిహారిక మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది. నిహారిక తన లుక్ మార్చిందంటూ, పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఇన్ని రోజులు ఏమైపోయావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.