Sanjjanaa Galrani : ప్రభాస్ హీరోయిన్‌కి శ్రీమంతం.. ఫ్రెండ్స్ చేశారంటూ ఎమోషనల్ పోస్ట్..

సంజన స్నేహితులు కొంతమంది కలిసి ఆమెకి సింపుల్ గా ఇంట్లో శ్రీమంతం నిర్వహించారు. దీంతో ఎమోషనల్ అయిన సంజన ఆ శ్రీమంతం ఫోటోలు షేర్ చేసి తన సోషల్ మీడియాలో........

Sanjjanaa Galrani : ప్రభాస్ హీరోయిన్‌కి శ్రీమంతం.. ఫ్రెండ్స్ చేశారంటూ ఎమోషనల్ పోస్ట్..

Sanjana

Updated On : April 26, 2022 / 7:09 AM IST

 

Sanjjanaa Galrani :  ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రెండో హీరోయిన్ గా మెప్పించిన సంజన గల్రాని తెలుగులో తక్కువ సినిమాలే చేసింది. కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే గతంలో కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి కూడా వెళ్ళొచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడు డాక్టర్ పాషాని 2021 జనవరిలో వివాహం చేసుకుంది. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Pratik Gandhi : రోడ్ మీద కాలర్ పట్టుకొని పక్కకి తోసేసిన పోలీసులు.. అవమానం అంటూ ట్వీట్ చేసిన హీరో..

ప్రస్తుతం సంజనకి 9వ నెల. దీంతో సంజన స్నేహితులు కొంతమంది కలిసి ఆమెకి సింపుల్ గా ఇంట్లో శ్రీమంతం నిర్వహించారు. దీంతో ఎమోషనల్ అయిన సంజన ఆ శ్రీమంతం ఫోటోలు షేర్ చేసి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సంజన తన శ్రీమంతం ఫోటోలు షేర్ చేసి.. ” కొంతమంది నా సౌత్ ఇండియన్ క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఎంతో ప్రేమగా శ్రీమంతం నిర్వహించారు. కొన్ని సార్లు కుటుంబం కంటే కూడా ఫ్రెండ్స్ ఎంతో గొప్ప. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో సరయిన వ్యక్తులు ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. నా స్నేహితులు సింపుల్ గా నాకు శ్రీమంతం చేశారు. ప్రస్తుతం నాకు 9వ నెల. త్వరలోనే బిడ్డని కనబోతున్నాను. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది నాకు ఒక్క గొప్ప రోజులా మిగిలిపోతుంది” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.