Pratik Gandhi : రోడ్ మీద కాలర్ పట్టుకొని పక్కకి తోసేసిన పోలీసులు.. అవమానం అంటూ ట్వీట్ చేసిన హీరో..

ఓ బాలీవుడ్ హీరోని ముంబై పోలీసులు రోడ్ మీద కాలర్ పట్టుకొని తోసేయడంతో ఇది చాలా అవమానం అంటూ ట్వీట్ చేశాడు ఆ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేస్తున్న ప్రతీక్ గాంధీ.........

Pratik Gandhi : రోడ్ మీద కాలర్ పట్టుకొని పక్కకి తోసేసిన పోలీసులు.. అవమానం అంటూ ట్వీట్ చేసిన హీరో..

Prathik Gandhi

Pratik Gandhi :  ఓ బాలీవుడ్ హీరోని ముంబై పోలీసులు రోడ్ మీద కాలర్ పట్టుకొని తోసేయడంతో ఇది చాలా అవమానం అంటూ ట్వీట్ చేశాడు ఆ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేస్తున్న ప్రతీక్ గాంధీ ‘స్కామ్‌ 1992’ వెబ్ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ సిరీస్ తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు ప్రతీక్. దీంతో ఇప్పుడు ప్రతీక్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా ప్రతీక్ ట్విట్టర్ లో ముంబై పోలీసులపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Sara Tendulkar : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు??

 

ప్రతీక్ ఈ ట్వీట్ లో.. ”ఆదివారం సాయంత్రం ముంబై WEH హైవే రోడ్డుపై వీఐపీ ఎవరో వస్తున్న కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అదే సమయంలో నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి ఆ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ క్రమంలో పోలీసులు నా షోల్డర్‌ పట్టుకుని పక్కనే ఉన్న ఓ మార్బుల్ గోడౌన్ లోకి నెట్టేశారు. నాకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే నేనేదో తప్పు చేసినట్టు తోసేశారు. ఇది చాలా అవమానకరంగా ఉంది” అంటూ తెలిపాడు. ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. మరి దీనిపై ముంబై పోలీసులు ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాలి.